Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

Advertiesment
auto driver

ఠాగూర్

, బుధవారం, 11 జూన్ 2025 (22:18 IST)
ముంబై మహానగరంలో ఓ ఆటో డ్రైవర్ వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ మొత్తం సంపాదిస్తూ లక్షలు అర్జిస్తున్నారు. ముంబైలోని అమెరికన్ కాన్సులేట్‌కు వీసాల కోసం వచ్చే వారే అతని ఆదాయంగా మార్చుకున్నాడు. తద్వారా నెలకు రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు అర్జిస్తున్నాడు. ఆ ఆటో డ్రైవర్ పేరు అశోక్. ఈ డ్రైవర్ కథన ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముంబైలోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయం వద్ద వీసా ఇంటర్వ్యూల కోసం వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు పడుతుండటాన్ని అశోక్ గమనించాడు. కాన్సులేట్ నిబంధనల ప్రకారం లోపలికి బ్యాగులు, సెల్‌ఫోన్లు తీసుకువెళ్లదానికి అనుమతి లేదు. అయితే, అక్కడ ఎలాంటి అధికారిక లాకర్లు లేదా వస్తువులు భద్రపరుచుకునే సౌకర్యం కూడా లేదు. దీంతో గంటల తరబడి క్యూలో నిల్చున్న తర్వాత, చివరి నిమిషంలో తమ వస్తువులను ఎక్కడ దాచుకోవాలో తెలియక వీసా దరఖాస్తుదారులు ఆందోళనకు గురవుతున్నారు. 
 
సరిగ్గా ఈ సమస్యనే అశోక్ అవకాశంగా మలుచుకున్నాడు. సమీపంలో తన ఆటోను పార్క్ చేసుకుని, ఇబ్బంది పడుతున్న వారిని గమనిస్తూ "సార్, మీ బ్యాగ్ ఇవ్వండి. భద్రంగా ఉంచుతాను. వెయ్యి రూపాయలు ఛార్జ్ అవుతుంది" అంటూ వారికి తన సేవలను అందిస్తున్నాడు. అత్యవసరంలో ఉన్నవారికి అశోక్ మాటలు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి.
 
ఇలా ఈ 'బ్యాగ్ హోల్డింగ్' సర్వీస్ ద్వారా అశోక్‌కు ప్రతిరోజూ 20 నుంచి 30 మంది కస్టమర్లు లభిస్తున్నారని సమాచారం. ఒక్కో వ్యక్తి నుంచి రూ.1,000 వసూలు చేయడం. ద్వారా రోజుకు రూ.20,000 నుంచి రూ.30,000 వరకు సంపాదిస్తున్నాడు. ఈ లెక్కన నెలకు రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఇది నగరంలోని అనేక మంది వైట్ కాలర్ ఉద్యోగుల జీతాల కంటే చాలా ఎక్కువ. దీనికోసం అతనికి ఎలాంటి మార్కెటింగ్ గానీ, వెబ్‌సైట్‌గానీ అవసరం రాలేదు. కేవలం మౌత్ టాక్ ద్వారా అతని ఆటో కాన్సులేట్ వద్ద నిలిపి ఉండటం వల్ల ఈ వ్యాపారం విజయవంతంగా నడుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్