Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్‌లో.. సెకండ్ సినిమా.. హేగ్జైటేడ్ హస్బెండ్ అంటూ సూర్య..?!

సింగం హీరో సూర్య సతీమణి జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్‌లో సెకండ్ సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమాను సీనియర్ హీరోయిన్లతో తెరకెక్కిస్తున్నారు. మేము సినిమా ద్వారా ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించిన జ్యోత

Advertiesment
Jyothika Begins Filming New Movie
, శనివారం, 16 జులై 2016 (17:21 IST)
సింగం హీరో సూర్య సతీమణి జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్‌లో సెకండ్ సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమాను సీనియర్ హీరోయిన్లతో తెరకెక్కిస్తున్నారు. మేము సినిమా ద్వారా ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించిన జ్యోతిక-సూర్య ఫ్యామిలీ, తమ సొంత బ్యానర్‌లో సినిమాలు వరుసపెట్టి నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. 
 
ఈ క్రమంలో తన భార్య కొత్త సినిమా మొదలు కావడంపై హీరో సూర్య చాలా హ్యాపీగా ఫీలవుతున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ''జో'' తన తర్వాతి సినిమాని ప్రారంభించిందని, త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. సూర్య ఈ ట్వీట్‌కు జతగా హేగ్జైటేడ్ హస్బెండ్ అని హ్యాష్ టాగ్ జత చేశారు. సూర్యను ప్రేమించి పెళ్ళి చేసుకున్న జ్యోతిక ఇటీవల "36 వయదినిలే" సినిమాతో కోలీవుడ్ పరిశ్రమలోకి రీఎంట్రీ ఇచ్చారు. 
 
ఈ సినిమా ద్వారా జ్యోతికకు మంచి మార్కులొచ్చాయి. ప్రస్తుతం ఆమె ‘కుట్రం కడిదల్‌’ చిత్ర దర్శకుడు బ్రహ్మ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు కాలేదు. ఇందులో భానుప్రియ, వూర్వశి, శరణ్య పొన్వనన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దొంగతనానికి కష్టానికి లింకుందా?