Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభాస్ అక్కగా జ్యోతిక.. రమ్యకృష్ణను అనుకున్నారు.. కానీ..?

Advertiesment
ప్రభాస్ అక్కగా జ్యోతిక.. రమ్యకృష్ణను అనుకున్నారు.. కానీ..?
, శుక్రవారం, 21 మే 2021 (13:48 IST)
రెబల్ స్టార్, బాహుబలి హీరో ప్రభాస్‌.. కెజిఎఫ్‌ మూవీ డైరెక్టర్‌ ప్రశాంత్‌నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం సలార్‌. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన శృతిహాసన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్‌కి అక్కగా జ్యోతిక నటించనున్నారనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. మొదటగా డైరెక్టర్‌ ప్రశాంత్‌నీల్‌ ప్రభాస్‌కి అక్కగా నటించే పాత్రలో సీనియర్‌ నటి రమ్యకృష్ణను అనుకున్నారట. 
 
అయితే తర్వాత రమ్యకృష్ణను కాకుండా.. నటి జ్యోతిక దగ్గరకు స్క్రిప్టును తీసుకెళ్లగా.. ఆమెకు కూడా.. కథ నచ్చినట్లు సమాచారం. అయితే జ్యోతిక మాత్రం తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదని తెలుస్తోంది. నటి జ్యోతిక సెకండ్‌ ఇన్నింగ్స్‌ తర్వాత ఆమె చిత్రాల ఎంపికలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆమె సెకండ్‌ ఇన్నింగ్స్‌ తర్వాత మహిళా ప్రధానమైన పాత్రలకే మొగ్గుచూపుతున్నారు.
 
కథ, పాత్ర నచ్చకపోతే.. పని లేకుండా ఉండడానికైనా ఇష్టపడుతున్నారని సినీవర్గాల సమాచారం. మరి ఆమె ఈ చిత్రంలో ప్రభాస్‌ అక్క పాత్రలో నటించడానికి ఒప్పుకుంటే.. ఏకంగా తమిళ, తెలుగు భాషా చిత్రాల్లో ఆమె కనిపించనున్నారు. 
 
కాగా.. ఈ చిత్రంలో జ్యోతిక నటించే పాత్ర కన్నడ వెర్షన్‌లో ప్రియాంక త్రివేది నటించనున్నారు. ఈ మూవీని హోంబలే ఫిల్మ్‌ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్‌ని ప్రారంభించారు. అయితే కోవిడ్‌ పరిస్థితుల రీత్యా.. షూటింగ్‌ ఆగిపోయింది. కరోనా పరిస్థితులు మామూలు పరిస్థితిలోకి రాగానే మళ్లీ షూటింగ్‌ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలని చిత్రయూనిట్‌ భావిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొన్నాంబళం కిడ్నీ ఆపరేషన్ కు మెగాస్టార్ రెండు లక్షల సాయం