క్రికెట్ 'అంపైర్'గా 'జ్యోతిలక్ష్మి' సత్యదేవ్
క్రికెట్‌లో కీలక నిర్ణయాలను తీసుకునేవాడు అంపైర్. అలాంటి తను జీవితంలో అనుకోని సందర్భాలు ఎదురైనప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు. అవి అతని జీవితంపై చుట్టూవున్నవారి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే
క్రికెట్‌లో కీలక నిర్ణయాలను తీసుకునేవాడు అంపైర్. అలాంటి తను జీవితంలో అనుకోని సందర్భాలు ఎదురైనప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు. అవి అతని జీవితంపై చుట్టూవున్నవారి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే పాయింట్‌తో ఓ చిత్రం రూపొందుతోంది. కామెడీతోపాటు థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్ పూర్తిచేసుకుంది.
'అసుర' చిత్రానికి పనిచేసిన వినయ్ మండ్ల దీనికి రచన, దర్శకత్వం వహిస్తున్నాడు. నటుడిగా ఎదుగుతున్న సత్యదేవ్ ఇందులో టైటిల్ పాత్ర పోషిస్తున్నాడు. శ్యామ్ దేవభక్తుని, కృష్ణ విజయ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలను తెలియజేస్తామని దర్శక నిర్మాతలు తెలియజేశారు.