Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎగ్జిబిటర్లు సహకరించండి.. థియేటర్లకు వెసులుబాటు ఇవ్వండని మోడీకి వినతి

పెద్ద నోట్లు చెల్లవనే.. ఈనెల 8న రాత్రి 8 గంటలకు ప్రధాని మోడీ ఇచ్చిన ట్విస్ట్‌.. నిర్మాతలకు నిద్రపట్టకుండా చేసిందని.. డిస్ట్రిబ్యూటర్‌, నిర్మాత మల్కాపురం శివకుమార్‌ అన్నారు. హార్ట్‌ఎటాక్‌ వస్తే ఎలా వుం

ఎగ్జిబిటర్లు సహకరించండి.. థియేటర్లకు వెసులుబాటు ఇవ్వండని మోడీకి వినతి
, బుధవారం, 16 నవంబరు 2016 (10:53 IST)
పెద్ద నోట్లు చెల్లవనే.. ఈనెల 8న రాత్రి 8 గంటలకు ప్రధాని మోడీ ఇచ్చిన ట్విస్ట్‌.. నిర్మాతలకు నిద్రపట్టకుండా చేసిందని.. డిస్ట్రిబ్యూటర్‌, నిర్మాత మల్కాపురం శివకుమార్‌ అన్నారు. హార్ట్‌ఎటాక్‌ వస్తే ఎలా వుంటుందో... అలా ప్రతి నిర్మాతనూ కలచివేసిందని.. సామాన్యుడి పరిస్థితి మరింత దారుణంగా ఉందని తెలిపారు. ఆయన ఈనెల 18న 'ఘటన' అనే సినిమాను విడుదల చేస్తున్నారు. 'దృశ్యం' దర్శకురాలు శ్రీప్రియ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, డిస్ట్రిబ్యూటర్‌గా శివకుమార్‌ ఈ చిత్రాన్ని 250 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. 
 
విడుదలకు ఇప్పటికే థియేటర్లు బుక్‌ అయ్యాయనీ, ఏమాత్రం ఆలస్యమైనా మరి థియేటర్లు దొరకవనీ అందుకే.. ఎగ్జిబిటర్లు దయచేసి.. పాత నోట్లను తీసుకోవాల్సింది విజ్ఞప్తి చేశారు. ఇందుకు ప్రధాని మోడీ కూడా ఓ సూచనను వారికి చేయాలనీ, ప్రేక్షకులు సినిమా చూసేందుకు వాడేవి నల్లడబ్బుకాదని. కష్టపడిందని అన్నారు. ఇది రాష్ట్ర సమస్యకాదనీ, జాతీయ సమస్యకాబట్టి.. ప్రతి నిర్మాత ఇబ్బంది పడే పరిస్థితి అని పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెద్ద నోట్ల రద్దు సినిమా కలెక్షన్లపై ప్రభావముంది: గౌతమ్‌ మీనన్‌