Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియమైన అభిమానులారా, జీవితాంతం మీకు రుణపడి ఉంటాను: జూనియర్ ఎన్టీఆర్

Advertiesment
Jr NTR
, బుధవారం, 20 మే 2020 (21:45 IST)
సినీ ప్రియులు తమ అభిమాన హీరో సినిమా విడుదలైతే బ్యానర్లు కట్టడం దగ్గర్నుంచి, సినిమాని విజయపథంలో నడిపించే దాకా అన్నీ దగ్గరుండి చూసుకుంటారు. వంద రోజుల ఫంక్షన్‌లు జరపడం వంటి కార్యకలాపాల్లో చురుకుగా పాలుపంచుకుంటారు. అందుకే హీరోలకు అభిమానులే బలం. అభిమానుల అండదండలు లేకపోతే హీరోలకు భవిష్యత్తు ఉండదు.
 
జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కనబర్చిన ఆదరాభిమానాలకు యంగ్ టైగర్ తన భావాలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. తన పట్ల అభిమానులు చూపే ప్రేమాభిమానాలు వెలకట్టలేనివని భావోద్వేగాన్ని పంచుకున్నారు.
 
‘‘మీరు నామీద చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది. అన్నింటా నాకు తోడుగా వస్తున్న మీరే నా బలం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని అవగలను? చివరి దాకా మీకు తోడుగా ఉండటం తప్ప.. నా ప్రియమైన అభిమానులారా, జీవితాంతం మీకు రుణపడి ఉంటాను’’ అని ట్వీట్ చేసారు.
 
‘‘ఎంతో ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నా సహచర నటీనటులకు, శ్రేయోభిలాషులకు, సినీ ప్రముఖులకు నా గుండె లోతుల్లో నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ ట్వీట్లు చదువుతుంటే చాలా గొప్పగా అనిపించింది. ఈరోజు మీరంత నాకు ఎంతో ప్రత్యేకంగా చేశారు’’ అంటూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ‌ల‌స కార్మికులను స్వ‌స్థ‌లాల‌కు పంపిస్తున్న హీరో మంచు మనోజ్