Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహేష్ హీరోయిన్‌ను లైన్లో పెట్టిన జూనియర్ ఎన్టీఆర్!

Advertiesment
మహేష్ హీరోయిన్‌ను లైన్లో పెట్టిన జూనియర్ ఎన్టీఆర్!
, బుధవారం, 12 మే 2021 (20:14 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం భరత్ అనే నేను. ఈ చిత్రంలో మహేష్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ఇపుడు ఈ భామకు మరో టాలీవుడ్ స్టార్‌తో నటించే లక్కీ ఛాన్స్ వరించింది. 
 
హీరో జూనియర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో ఉండనుంది. ప్రస్తుతం కొరటాల శివ చేస్తున్న 'ఆచార్య' .. చిత్రీకరణ పరంగా చివరిదశలో ఉంది. ఈ సినిమాకి సంబంధించిన పనులు పూర్తయిన తర్వాతనే ఆయన ఎన్టీఆర్ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు. 
 
ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. ఈ పాత్ర చాలా పవర్ఫుల్‌గా ఉంటుందనీ, ఇంతవరకూ ఎన్టీఆర్ ఈ తరహా పాత్రను చేయలేదని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో కథానాయికగా ఛాన్స్ ఎవరికి దక్కనుందనేది ఆసక్తికరంగా మారింది.
 
కొరటాల ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసే ఆలోచనలో ఉండటం వలన, ఈ సినిమా కోసం కియారా అద్వానిని గానీ .. రష్మికనుగాని కథానాయికగా తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. 
 
అయితే, 'భరత్ అనే నేను'తో కియారాకు కొరటాల పెద్ద హిట్ ఇచ్చాడు. అందువలన ఆయన సంప్రదిస్తే ఆమె కాదనకపోవచ్చనే టాక్ వినిపించింది. అందుకే ఈ సినిమాలో కథానాయికగా ఆమెకి ఛాన్స్ లభించే అవకాశాలే ఎక్కువన్న టాక్ ఫిల్మ్ సిటీలో వినిపిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమంత వర్కౌట్స్ అభిమానులు ఫిదా