Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగార్జునకు ప్రేమతో ఎన్టీఆర్ పరామర్శ.. గ్యారేజ్ షూటింగ్ వాయిదా.. బెంగళూరుకెళ్లి..?!

మిర్చి, శ్రీమంతుడు దర్శకుడు కొరటాల శివతో జనతా గ్యారేజ్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్.. ఈ సినిమా షూటింగ్ గ్యాప్‌లో తన వీరాభిమానిని కలిసొచ్చాడు. గతంలో పవన్ కల్యాణ్ శ్రీజను కలిసొచ్చిన తరహాలోనే.. యంగ్ టైగర్ జ

Advertiesment
Jr NTR
, శనివారం, 30 జులై 2016 (14:58 IST)
మిర్చి, శ్రీమంతుడు దర్శకుడు కొరటాల శివతో జనతా గ్యారేజ్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్.. ఈ సినిమా షూటింగ్ గ్యాప్‌లో తన వీరాభిమానిని కలిసొచ్చాడు. గతంలో పవన్ కల్యాణ్ శ్రీజను కలిసొచ్చిన తరహాలోనే.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా రియల్ లైఫ్‌లో హీరోగానని నిరూపించుకున్నాడు. ఓ కేన్సర్ పేషెంట్ ఎన్టీఆర్‌ను కలవాలని కోరుకోవడంతో గ్యారేజ్ షూటింగ్‌ను వాయిదా వేసుకున్నాడు. 
 
ఈ క్రమంలో అభిమానుల్నే దేవుళ్లగా భావించే ఎన్టీఆర్, కేన్సర్‌తో బాధపడుతూ.. మృత్యువుతో పోరాడుతున్న బెంగళూరుకు చెందిన నాగార్జునను పరామర్శించాడు. నాగార్జున కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నాగార్జున కుటుంబానికి వ్యక్తిగతంగా సహాయం చేస్తానని.. అభిమానులు తమను అభిమానించడం కాదు.. తాము కూడా ఫ్యాన్స్‌ను అభిమానిస్తాం.. ప్రేమిస్తామని జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సునీత పర్సనల్ లైఫ్ గురించి ఎందుకు చెప్పింది..? అంతా పబ్లిసిటీ కోసమేనా...? ఇంకేమైనా ఉందా?