Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యావత్ భారత సాహసపుత్రిక జయలలిత... రజినీ : అమ్మ కోసం స్వర్గంలో మరో సింహాసనం... త్రిష

అనారోగ్య కారణంగా సోమవారం రాత్రి కన్నుమూసిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు తమిళ సినీ పరిశ్రమ ఘన నివాళి అర్పించారు. అసాధారణ వ్యక్తిత్వం.. పోరాట పంథాతో తుదికంటూ పోరాడి దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స

యావత్ భారత సాహసపుత్రిక జయలలిత... రజినీ : అమ్మ కోసం స్వర్గంలో మరో సింహాసనం... త్రిష
, మంగళవారం, 6 డిశెంబరు 2016 (12:51 IST)
అనారోగ్య కారణంగా సోమవారం రాత్రి కన్నుమూసిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు తమిళ సినీ పరిశ్రమ ఘన నివాళి అర్పించారు. అసాధారణ వ్యక్తిత్వం.. పోరాట పంథాతో తుదికంటూ పోరాడి దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహిళా రాజకీయవేత్త తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. 
 
ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం రాత్రి కన్నుమూశారు. దీంతో కోట్లాది మంది తమిళ ప్రజలు శోకసముద్రంలో మునిగిపోయారు. కథానాయకిగా సినీరంగంలో వెలుగుతూ రాజకీయాల్లోకి ప్రవేశించి విప్లవనాయకిగా కీర్తి గడించిన అలనాటి అందాల తార జయలలితకు తమిళ సినీ రంగ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా నివాళు లర్పించారు. ముఖ్యంగా తమిళ సినీ అగ్ర హీరోలు, హీరోయిన్లు అమ్మ ఆత్మకు శాంతి కలగాలంటూ ట్విట్ చేశారు. 
 
తమిళనాడుకే కాదు... యావత్ భారతదేశానికే సాహస పుత్రిక అని సూపర్ స్టార్ రజనీకాంత్ ట్విట్టర్ ద్వారా అమ్మ మృతికి సంతాపం తెలిపారు. బల్గేరియాలో షూటింగ్‌లో ఉన్న అజిత్ కుమార్ అమ్మ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జీవితంలో అనేక యుద్ధాల్లో పోరాడుతూ ధైర్యంగా నిలబడ్డారనీ, ఈ సమయంలో ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని ఆ దైవం ప్రసాదించాలంటూ ట్వీట్ చేశారు.
 
స్వర్గంలో ఆమెకోసం మరోసింహాసనం ఎదురుచూస్తోందని హీరోయిన్ త్రిష ట్వీట్ చేశారు. తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి జయలలిత అంటూ ఆమె సంతాపం ప్రకటించారు. ఆమెను కలవడం అదృష్టమనీ, చాలా గర్వంగా ఉందంటూ జయలలిత కలిసిన క్షణాలను ఆమె గుర్తు చేసుకున్నారు. అతి ధైర్యవంతమైన మహిళల్లో జయలలిత ఒకరని శృతి హాసన్ ట్వీట్ చేశారు. తమిళనాడు అత్యంత సాహసోపేతమైన మహిళా నాయకురాలని కోల్పోయిందని, ఆమె మృతి తీరనిలోటని విచారం వ్యక్తం చేశారు.
 
ఆమె ఒక ఫైటర్, అందరికీ స్ఫూర్తి ప్రదాత అంటూ ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి జయలలిత మరణం తమిళ ప్రజలకు తీరని లోటు.. కానీ వారి గుండెల్లో శాశ్వతంగా మిగిలిపోతారని, అమ్మ ఆత్మకు శాంతి కలగాలని రాధిక తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'అమ్మ' జయలలిత నా సీనియర్.. నేను ఆమె ఒకే స్కూల్లో చదివాం: హీరో సుమన్