Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెండితెరకు పరిచయంకానున్న జానీ లీవర్ కుమార్తె!!

Advertiesment
jamie lever

వరుణ్

, గురువారం, 18 జనవరి 2024 (12:49 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం. అలాగే, బాలీవుడ్‌లో జానీ లీవర్ అంతటి స్థాయి నటుడు. హిందీ చిత్రపరిశ్రమలో నంబర్ వన్ హాస్య నటుడు. ఇపుడు జానీ లీవర్ వారసురాలు వెండితెరకు పరిచయంకానుంది. పేరు జామీ లీవర్. 
 
జానీ లీవర్ స్వస్థలం ఏపీలోని ప్రకాశం జిల్లా కనిగిరి. ఆయన అసలు పేరు జాన్ రావు. జానీ లీవర్ తండ్రి పొట్టకూటి కోసం ముంబై వలస వెళ్లి హిందూస్థాన్ లీవర్ కంపెనీలో చేరాడు. ఆ కంపెనీ పేరులోని లీవరే మన జాన్ రావు పేరులో చివర చేరింది. ఓ దశలో చదువుకోవడానికి డబ్బులు లేక, ఏడో తరగతితో చదువు ఆపేసిన జానీ లీవర్ అనేక కష్టాలు ఎదుర్కొని టాప్ కమెడియన్‌గా పేరుతెచ్చుకున్నాడు.
 
తండ్రి బాటలోనే జానీ లీవర్ కుమార్తె జామీ లీవర్ కూడా నటనా రంగంలోకి ప్రవేశించారు. అనేక బాలీవుడ్ సినిమాలతో ప్రతిభావంతురాలైన నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. జామీ లీవర్ ఇన్నాళ్లకు తన మాతృభాష తెలుగులో నటించనున్నారు.
 
'చోటా భీమ్' నిర్మాత రాజీవ్ చిలక నిర్మిస్తున్న 'ఆ ఒక్కటి అడక్కు' చిత్రం ద్వారా ఆమె టాలీవుడ్ వెండితెరకు పరిచయమవుతున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ, తన మాతృభాష తెలుగులో సినిమా చేస్తుండడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా, తెలుగులో సినిమా చేయడం ద్వారా నాయనమ్మకు హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నానని జామీ తెలిపారు. తెలుగులో సినిమా చేయాలన్నది తన కల అని, ఈ సినిమా వృత్తిపరంగానే కాకుండా, తన కుటుంబ మూలాల పరంగా భావోద్వేగాలతో కూడిన అంశమని పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టైగర్ నాగేశ్వరరావుకు బాలీవుడ్ కష్టాలు..