Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విక్రాంత్ రోణ‌లో `గ‌దంగ్ రాక్క‌మ్మ‌`గా జాక్వలైన్ ఫెర్నాండెజ్‌

Advertiesment
విక్రాంత్ రోణ‌లో `గ‌దంగ్ రాక్క‌మ్మ‌`గా జాక్వలైన్ ఫెర్నాండెజ్‌
, శనివారం, 31 జులై 2021 (17:03 IST)
Kicha Sudeep, Jacqueline
కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘విక్రాంత్ రోణ‌’. 3డీలో సినిమా రూపొందుతోంది. బాలీవుడ్ స్టార్ జాక్వలైన్ ఫెర్నాండెజ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. కాగా శ‌నివారం ఆమె పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. భార‌త‌దేశంలోని ముంబై బిల్‌బోర్డ్స్ స‌హా ఇత‌ర న‌గ‌రాల్లో ఈ ఫ‌స్ట్‌లుక్‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. రాక్వెల్ డీ కోస్టా అలియాస్ గ‌దంగ్ రాక్క‌మ్మగా జాక్వ‌లైన్ ఫ‌స్ట్ లుక్‌తో పాటు ఆమె పాత్ర‌కు సంబంధించిన గింప్స్‌ను కూడా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. 
 
గ‌దంగ్ రాక్క‌మ్మ పాత్ర‌లో చాలా వేరియేష‌న్స్ ఉంటాయి. ఆమె ఓ క‌ల్పిత ప్రాంతంలో ఓ చిన్న హోట‌ల్‌ను న‌డుపుతుంటుంది. బాద్‌షా కిచ్చా సుదీప్ పోషించిన విక్రాంత్ రోణ పాత్ర‌కు ఆమె జోడీగా క‌నిపిస్తుంది. విక్రాంత్ రోణ ప్ర‌పంచంలోకి అగ్నిలా కాలు పెట్టిన జాక్వ‌లైన్ వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచింది. ఈ సినిమాలో ఆమె కీల‌క పాత్ర‌ను పోషించ‌డ‌మే కాదు, సుదీప్‌తో క‌లిసి ఓ పాట‌కు స్టెప్పులేసింది. 
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత జాక్ మంజునాథ్ మాట్లాడుతూ ``విక్రాంత్ రోణ ఈ ప్ర‌పంచానికి ప‌రిచ‌యం కానున్న కొత్త హీరో. ఆయ‌న‌తో జాక్వ‌లైన్ జ‌త‌క‌ట్ట‌డం మ‌రింత ఎగ్జ‌యిటింగ్‌గా మారింది. ఆమె పాత్ర‌కు సంబంధించిన గ్లింప్స్‌ను విడుద‌ల చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. రాబోయే త‌రాలు గుర్తు పెట్టుకునేలా ఓ సినీ అద్భుతాన్ని క్రియేట్ చేసే దారిలో మేమంద‌రం ప్రయాణిస్తున్నాం. మా సినిమాపై భారీ అంచ‌నాలు పెరుగుతున్నాయి`` అన్నారు. 
 
చిత్ర ద‌ర్శ‌కుడు అనూప్ భండారి మాట్లాడుతూ ``ప్ర‌తి అనౌన్స్‌మెంట్‌లో ఓ స‌ర్‌ప్రైజ్‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేస్తుండం మాకు కూడా అమేజింగ్‌గా అనిపిస్తోంది. జాక్వ‌లైన్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌డం వ‌ల్ల సినిమా స్పాన్ గురించి తెలియ‌జేస్తుంది. అంతే కాదు, ప్రేక్ష‌కులు వారి విలువైన స‌మ‌యాన్ని థియేట‌ర్స్ గ‌డ‌ప‌డం వారికి త‌గిన‌దే అనిపించేలా ఉండేందుకు మా వంతు ప్ర‌య‌త్నాన్ని మేం చేస్తున్నాం`` అన్నారు. 
 
జాక్వలైన్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ ``ఈ చిత్ర‌యూనిట్‌లో ప్ర‌తి ఒక్క‌రూ నన్ను అద్భుతంగా స్వాగతించారు. ఈ సినిమాలో భాగ‌మైన ప్ర‌తి క్ష‌ణం చాలా ఎగ్జ‌యిట్‌మెంట్ వేసింది. ఇంత గ్రాండ్ లెవ‌ల్లో పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన నిర్మాత‌ల‌కు హృదయ పూర్వ‌కంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. ఈ సినిమాకు సూప‌ర్ స్పెష‌ల్‌, గుర్తుండిపోయే చిత్ర‌మ‌వుతుంది`` అన్నారు. 
 
-  ‘విక్రాంత్ రోణ‌’ త్రీడీలో 14 భాష‌లు, 55 దేశాల్లో విడుద‌ల‌వుతుంది. అనూప్ భండారి ద‌ర్శ‌క‌త్వంలో జాక్ మంజునాథ్ షాలిని మంజునాథ్‌(షాలిని ఆర్ట్స్‌) నిర్మిస్తున్న ఈ చిత్రానికి అలంకార్ పాండియ‌న్‌(ఇన్‌వెనో ఫిలింస్‌) స‌హ నిర్మాత. బి.అజ‌నీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కె.జి.య‌ఫ్ ఫేమ్ శివ‌కుమార్ భారీ సెట్స్ వేశారు. అలాగే విలియ‌మ్ డేవిడ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. కిచ్చా సుదీప్‌, నిరూప్ భండారి, నీతా అశోక్‌, జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లి వ్య‌వ‌స్థే మ్యాడ్ సినిమాకు కారణం అయిందిః దర్శకుడు లక్ష్మణ్ మేనేని