Ram Prasad, Neha desh Pandey
జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్ బ్యాచ్ ముగ్గురూ సినిమాల్లోకి వచ్చేశారు. ఇప్పుడు రామ్ ప్రసాద్ హీరోగా ఓ సినిమా చేశాడు. దీనికి `పీప్ షో` పేరు పెట్టారు. క్రాంతికుమార్ సి.హెచ్ దర్శకత్వం వహించారు. సుప్రీమ్ డ్రీమ్స్ పతాకంపై టి.వి.ఎన్.రాజేష్ సమర్పణలో అమి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న వినూత్న కథా చిత్రమిది. దొంగచాటుగా తొంగిచూడడాన్ని "పీప్ షో" అంటారన్న విషయం తెలిసిందే. నేహాదేశ్ పాండే హీరోయిన్. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ క్రేజీ చిత్రం టీజర్ రిలీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ చిత్రానికి మలయాళ సంగీత సంచలనం రంజిన్ రాజ్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే నమ్మకముందని చిత్ర దర్శకుడు క్రాంతి కుమార్, నిర్మాతలు టి.వి.ఎన్.రాజేష్, ఎస్.ఆర్.కుమార్ తెలిపారు. తన చిరకాల మిత్రుడు క్రాంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "పీప్ షో" చిత్రంతో తెలుగులో పరిచయం అవుతుండటం చాలా సంతోషంగా ఉందన్నారు సంగీత దర్శకుడు రంజిన్ రాజ్. "పీప్ షో" చిత్రం దర్శకుడిగా తన మిత్రుడు క్రాంతి దర్శకత్వ ప్రతిభకు అద్దం పడుతుందని హీరో రామ్ ప్రసాద్ పేర్కొన్నారు.