Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హ‌ర‌నాథ్ మ‌న‌వ‌డు విరాట్ రాజ్ హీరోగా - సీతామనోహర శ్రీరాఘవ

Advertiesment
Harnath
, బుధవారం, 20 అక్టోబరు 2021 (15:50 IST)
AM Ratnam, Anil, Virat, Syamla krishnamraj and ohters
వెండితెర కు మరో నట వారసుడు పరిచయం అవుతున్నాడు. అలనాటి అందాల హీరో హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనుమడు ఈ విరాట్ రాజ్. ఈయ‌నే క‌థానాయ‌కుడిగా `సీతామనోహర శ్రీరాఘవ` చిత్రంలో న‌టిస్తున్నాడు. బుధ‌వారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖులు, ఆత్మీయులు సమక్షంలో వైభవంగా ప్రారంభం అయింది. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి క్లాప్ నిచ్చారు. యువ హీరో ఆకాష్ పూరి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామల  హీరో విరాట్ రాజ్ కు ఆశీస్సులు అందించి, యూనిట్ కు శుభాకాంక్షలు తెలియ చేసారు.
 
`ఇటు తాత వెంకట సుబ్బరాజు, అటు పెద తాత హరనాథ్ గారి స్ఫూర్తి తో ఈ ‘సీతామనోహర శ్రీరాఘవ' చిత్రం ద్వారా హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఇది సరైన చిత్రంగా భావిస్తున్నాను. మీడియా, చిత్ర పరిశ్రమలోని పెద్దలు, ప్రేక్షకులు ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను అన్నారు 'విరాట్ రాజ్.
 
webdunia
Clap by Anil ravipudi
దర్శకుడిగా పరిచయం అవుతున్న దుర్గా శ్రీ వత్సస.కె. మాట్లాడుతూ, మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఒక ఇమేజ్ కు మాత్రమే పరిమితం కాకుండా ఈ చిత్రం ద్వారా భిన్నమైన చిత్రాలకు సరితూగే ఇమేజ్ ను 'విరాట్ రాజ్' స్వంతం చేసుకునేలా ఈ చిత్రం కథను సిద్ధం చేశాం. చిత్రం పేరు ‘సీతామనోహర శ్రీరాఘవ'. పేరు వెనుక కథ ఏమిటన్నది ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నాం. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా, మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పలు భావోద్వేగాల సమ్మిళితం. కె.జి.ఎఫ్. 2, సలార్  చిత్రాలకు సంగీతం సమకూరుస్తున్న 'రవి బస్ రుర్' ఈ  చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన సంగీతం ఈ చిత్రాన్ని మరో మెట్టు ఎక్కిస్తుందని నమ్ముతున్నాను. అలాగే త్రిబుల్ ఆర్ చిత్రానికి పోరాటాలు సమకూర్చిన కింగ్ సాలమన్ ఈ చిత్రానికి కంపోజ్ చేస్తున్న పోరాటాలు చిత్రానికి మరో ఆకర్షణ. నిర్మాత సుధాకర్ హీరో కుటుంబానికి సన్నిహిత మిత్రులు అని తెలిపారు.
 
- మా వందన మూవీస్ చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా విరాట్ పరిచయం చేయటం చాలా ఆనందంగా ఉంది. చిత్రం రెగ్యులర్ న‌వంబ‌ర్ నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుందని చిత్ర నిర్మాత సుధాకర్ తెలిపారు.
 
సంగీత దర్శకుడు రవి బస్ రుర్ మాట్లాడుతూ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించటం ఆనందంగా ఉందన్నారు.  కధానాయిక రేవ మాట్లాడుతూ ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం కావటం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిత్ర ప్రారంభోత్సవానికి విచ్చేసి ఆశీస్సులు అందించిన ప్రముఖులు నిర్మాత లు ఎ.ఎం.రత్నం,సురేష్ బాబు,దర్శకుడు అనిల్ రావిపూడి, యువ హీరో ఆకాష్ పూరి,రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామల గారు లకు చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపారు.
 
ఈ చిత్రంలో నాయికగా రేవ, ఇతర పాత్రల్లో తనికెళ్లభరణి, బ్రహ్మాజీ, పృథ్వీ, కబీర్ దుహాన్ సింగ్, ప్రవీణ్, గోపరాజు రమణ, రాఘవ,కృష్ణ, నిఖిలేంద్ర, సత్య సాయి శ్రీనివాస్, రూపాలక్ష్మి నటిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రగ్స్ కేసు : షారూక్ తనయుడికి మళ్లీ నిరాశ