Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజీవ్ కనకాలపై రష్మీ దాడి.. బుగ్గ, నుదుటిపై రక్కేసింది.. నిజమేనా?

Advertiesment
Jabardasth Anchor Rashmi Gautam Attacks Rajeev Kanakala
, బుధవారం, 11 మే 2016 (13:49 IST)
జబర్దస్త్‌తో యాంకర్‌గా బాగా పాపులర్ అయిన రష్మీ గౌతమ్.. గుంటూరు టాకీస్ సినిమా ద్వారా ప్రేక్షకుల మదిలో మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాలో హాట్‌హాట్‌ అందాలతో కుర్రకారును మత్తెక్కించింది. ప్రస్తుతం ‘చారుశీల’ చిత్రంలో రష్మీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలో ఈ సినిమా తెరపైకి రానుంది. ఇదే సినిమాలో రాజీవ్ కనకాల.. యాంకర్ సుమ భర్త కీలక పాత్ర పోషిస్తున్నారు.
 
ఈ చిత్ర షూటింగ్‌లో రాజీవ్‌కనకాలపై రష్మి దాడి చేసిందంట. ఈ విషయాన్ని రాజీవ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘చారుశీల షూటింగ్‌లో రష్మి నాపై దాడి చేసింది. ఏమిటి రష్మిజీ ఇది. ఎవరైనా అడగండి ఏంటి పని’ అంటూ రాజీవ్‌ పోస్ట్‌ చేశారు. ఈ చిత్రంలో రాజీవ్‌ బుగ్గ, నుదుటిపై రక్కేసినట్లు కనిపిస్తోంది. అసలు ఇలా జరగడానికి కారణం ఏమిటా? అని నెటిజన్లు ఆలోచిస్తున్నారు. 
 
షూటింగ్‌లో భాగంగా రాజీవ్ కనకాలపై రష్మీ దాడి చేసిందని కొందరంటే.. రాజీవ్ కనకాలను రష్మీ నిజంగానే దాడి చేసిందా? అయితే అతనిపై దాడి చేసేందుకు అసలు కారణం ఏమిటనే దానిపై నెటిజన్లు పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలు ఏం జరిగిందో రష్మినే చెప్పాలి మరి. ఇంకా ఈ విషయం సుమకు తెలుసో లేదో మరి..!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రహ్మోత్సవం ఓవర్సీస్ రైట్స్‌‌కు భారీ డిమాండ్.. రూ. 13కోట్లు పలికిందట!?