హుషారు వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తేజస్ కంచర్ల. తేజస్ చేస్తోన్న తాజా చిత్రం ఉరుకు పటేల. గెట్ ఉరికిఫైడ్ సినిమా ట్యాగ్ లైన్. లీడ్ ఎడ్జ్ పిక్చర్స్ బ్యానర్‌పై వివేక్ రెడ్డి దర్శకత్వంలో కంచర్ల బాల భాను ఈ సినిమాను నిర్మించారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు ప్రవీణ్ లక్కరాజు సంగీతాన్ని సమకూర్చారు. సెప్టెంబర్ 7న వినాయక చవితి స్పెషల్‌గా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో హీరో తేజస కంచర్ల మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే..
హుషారు తరువాత చాలా కథలు విన్నాను. ఏదైనా కొత్తగా ఉండే కథలను చేయాలని అనుకున్నా. అందుకే చాలా రొటీన్ కథలను విన్న తరువాత ఈ పాయింట్ నాకు చాలా నచ్చింది. వివేక్ ఈ పాయింట్‌ను చెప్పినప్పుడు ఎగ్టైట్ అయ్యాను. ఆ తరువాత ఇద్దరం కలిసి కథను రాసుకున్నాం. అలా ఈ మూవీ స్క్రిప్ట్‌ను పూర్తి చేశాం.
ఈ చిత్రం హిట్ అయి డబ్బులు వస్తే.. ఆ తరువాత మంచి కథలు దొరికితే కచ్చితంగా నిర్మిస్తాను. కానీ ఈ సారి మాత్రం నిర్మిస్తూ, నటించను. ఆ రెండూ ఒకేసారి చేయడం చాలా కష్టం.
* ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూసేలా ఈ చిత్రం ఉంటుంది. ఆద్యంతం నవ్వించేలా ఉంటుంది. లాక్డౌన్‌లో ఉన్న టైంలో మూఢనమ్మకాల గురించి వార్తలు ఎక్కువగా చదివాను. అలా కొన్ని ఘటనల చుట్టూ ఈ కథను అల్లుకున్నాను. థ్రిల్లర్, కామెడీ జానర్లో అ మూవీని పూర్తి ఎంటర్టైన్మెంట్‌గా తీశాం.
* ఫ్యూచర్‌లో డైరెక్షన్ చేయాలని కోరిక ఉంది. నా వద్దకు వచ్చే కథల్లో అవసరమైతే ఇన్ పుట్స్ ఇస్తాను. నాకు రైటింగ్ అంటే చాలా ఇష్టం. నాకు పాత్ర నచ్చితే, అందులో మజా ఉందనిపిస్తే స్పెషల్ రోల్స్ అయినా చేస్తాను అన్నారు.