Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'అజ్ఞాతవాసి' అట్టర్ ప్లాప్... ఎన్టీఆర్ చిత్రానికి 'అసమాన్యుడు' పేరు పెట్టే దమ్ముందా?

యంగ్ టైటిల్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. ఎన్ట

Advertiesment
'అజ్ఞాతవాసి' అట్టర్ ప్లాప్... ఎన్టీఆర్ చిత్రానికి 'అసమాన్యుడు' పేరు పెట్టే దమ్ముందా?
, గురువారం, 10 మే 2018 (14:26 IST)
యంగ్ టైటిల్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తోంది. ఈ సినిమా టైటిల్‌ని అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయ‌లేదు కానీ... ఓ టైటిల్ ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఆ టైటిలే.. ‘అసమాన్యుడు’. ఈ మూవీకి అసమాన్యుడు అనే పేరు పెట్టే ఆలోచనలో చిత్రయూనిట్ ఉందని ఫిల్మ్‌న‌గ‌ర్లో టాక్ వినిపిస్తోంది. 
 
చిత్ర‌ యూనిట్ మాత్రం టైటిల్ గురించి ఇంకా ఏమీ అనుకోలేద‌ని చెబుతున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చాలా సన్నివేశాలు రాయలసీమ నేపథ్యంలో సాగబోతున్నాయని తెలిసింది. ఈ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించేందుకు రామోజీ ఫిల్మ్‌సిటీలో సీమ వాతావరణాన్ని ప్రతిబింబించేలా సెట్‌ని రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సెట్లో కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ ప్రారంభించ‌నున్నారు. అజ్ఞాత‌వాసి సినిమా అట్ట‌ర్‌ఫ్లాప్ అవ్వ‌డంతో త్రివిక్ర‌మ్ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుని ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. మ‌రి... త్రివిక్ర‌మ్ ఆశిస్తున్న స‌క్స‌స్ ఈ సినిమా ఇస్తుందో లేదో చూడాలి..!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రీస్తు చనిపోయిన తరువాత తిరిగి లేచారనడం అవాస్తవం: ఇళయరాజా