Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వసంత్ రవి ద్విభాషా చిత్రం టైటిల్ ఇంద్ర

Advertiesment
Vasant Ravi
, శనివారం, 16 డిశెంబరు 2023 (17:01 IST)
Vasant Ravi
వసంత్ రవి హీరోగా జేఎస్ఎం పిక్చర్స్, ఎంపరర్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిసున్న తెలుగు, తమిళ్ ద్విభాషా చిత్రానికి 'ఇంద్ర' అనే టైటిల్ ని ఖరారు చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న  ఈ చిత్రాన్ని JSM పిక్చర్స్ ఏఆర్ జాఫర్ సాదిక్, ఎంపరర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇర్ఫాన్ మాలిక్‌తో కలిసి నిర్మిస్తున్నారు.
 
నయనతార నటించిన ఐరా, మద్రాస్ టాకీస్ ప్రొడక్షన్ నవరస చిత్రాలలో పనిచేసిన శబరీష్ నందా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మెహ్రీన్‌ పిర్జాదా కథానాయికగా నటిస్తోంది. వీరితో పాటు అనికా సురేంద్రన్, సునీల్, కళ్యాణ్ మాస్టర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  టీం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనురాగ్, అవికా గోర్ ల ఉమాపతి విడుదలకు సిద్ధమైంది