Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనురాగ్, అవికా గోర్ ల ఉమాపతి విడుదలకు సిద్ధమైంది

Advertiesment
Anurag, Avika Gor
, శనివారం, 16 డిశెంబరు 2023 (16:50 IST)
Anurag, Avika Gor
గ్రామీణ ప్రేమ కథా చిత్రాలకు ఆడియెన్స్ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ కథతో ‘ఉమాపతి’ అనే చిత్రం రాబోతోంది. ఈ సినిమాలో అనురాగ్ హీరోగా నటిస్తుండగా.. చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తోంది. క్రిషి క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని కే.కోటేశ్వర రావు నిర్మిస్తుండగా.. సత్య ద్వారంపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్ ఇలా అన్నీ కూడా పాజిటివ్ బజ్‌ను సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు.
 
ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే అందమైన గ్రామీణ వాతావరణం, ఊర్లోని రకరకాల మనస్తత్వాలున్న మనషులు, అల్లరి చిల్లరగా తిరిగే హీరో.. రెండు ఊర్ల మధ్య ఏవో గొడవలు ఉన్నట్టు.. ఆ గొడవలే హీరో హీరోయిన్ల ప్రేమకు అడ్డంకిలా మారేట్టు చూపించిన సీన్లు బాగున్నాయి. ట్రైలర్‌లో సహజత్వం ఉట్టి పడుతోంది. విజువల్స్ ఎంతో నేచురల్‌గా ఉన్నాయి. ఆర్ఆర్ చక్కగా ఉంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ వినోదాత్మకంగా చిత్రంగా తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
 
ఫిదా వంటి బ్లాక్ బస్టర్ మూవీకి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాకు రాఘవేంద్ర కెమెరామెన్‌గా, గౌతమ్ రాజు, నానిలు ఎడిటర్లుగా పని చేశారు. వెంకట్ ఆరే ఆర్ట్ డిపార్ట్మెంట్‌ను, చంద్రబోస్, మూర్తి దేవగుప్తపు, భాస్కర భట్ల పాటల రచయితలుగా పని చేశారు. ఈ మూవీ డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శృతి హాసన్ గ్రిప్పింగ్ క్యారెక్టర్ పోస్టర్ ఫస్ట్ లుక్‌ ను షేర్ చేసిన అడివి శేష్