Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కె. యస్. రామారావు, ఘంటా శ్రీనివాసరావు ప్రారంభించిన ఐక్యూ చిత్రం

K.s. Rama Rao, Ghanta Srinivasa Rao, Sai Charan, Pallavi, K.S. Rama Rao, Ghatikachalam
, శనివారం, 18 జూన్ 2022 (19:31 IST)
K.s. Rama Rao, Ghanta Srinivasa Rao, Sai Charan, Pallavi, K.S. Rama Rao, Ghatikachalam
సాయి చరణ్, పల్లవి జంటగా శ్రీనివాస్ దర్శక, నిర్మాణ సారద్యంలో తెరకెక్కుతున్న "IQ  చిత్రం శ‌నివారంనాడు ప్ర‌సాద్‌ల్యాబ్‌లో ప్రారంభ‌మైంది. పూజా కార్యక్రమాల అనంతరం మాజీ మంత్రి ఘంటా శ్రీనివాసరావు  కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత కె. యస్. రామారావు  గౌరవ దర్శకత్వం వహించారు. 
 
అనంత‌రం ఘంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సినిమా చిన్నదైనా పెద్దదైనా మంచి కంటెంట్ ఉంటే కచ్చితంగా ప్రేకాకధారణ పొందుతుంది. యూత్ ఫుల్ సబ్జెక్టు తో వస్తున్న IQ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి. అలాగే కె. యస్. రామారవు చెప్పిన జాగ్రత్తలు అన్ని పాటిస్తూ నిర్మాతలు అనుకున్న బడ్జెట్‌లో సినిమా తియ్యాలి. ఈ చిత్ర హీరోను చూస్తుంటే డి. జె. టిల్లు హీరో గుర్తుకు వస్తున్నాడు. ఇందులో నటించిన నటీనటులు, టెక్నిషియన్స్ అందరికీ ఈ సినిమా మంచి పేరు రావాలని కోరుతున్నాన‌ని అన్నారు.
 
కె. యస్. రామారావు గారు మాట్లాడుతూ.."IQ" అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చే విధంగా ప్రతి సీన్ కొత్త దనంగా ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు థియేటర్ కు వస్తారు. క‌థ‌ను బట్టి హంపి ప్రదేశాన్ని ఎన్నుకున్నారు కాబట్టి ఖర్చు కాస్తా ఎక్కువగానే అయ్యి ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రేక్షకులలోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. అయితే "iQ" అనే టైటిల్ అందరికి అర్థమవ్వడం కష్టం.ఇలాంటి మంచి చిత్రాన్ని దర్శక, నిర్మాతలు ఎంత ఎక్కువగా ప్రమోషన్ చేసుకుంటే అంత మంచిది. ముఖ్యంగా ఇండస్ట్రీ లో దిల్ రాజు, సురేష్ బాబు సునీల్ నారంగ్ , అల్లు అరవింద్  ఈ నలుగురికి నచ్చితేనే అది తెరపైకి(థియేటర్స్) వస్తుంది. కాబట్టి వారికిది కచ్చితంగా నచ్చాలి. ఇకప్పుడు సినిమాలకు టీవి ఒక్టే విరోధిగా ఉండేది. ఇప్పుడు ఓటిటి కూడా విరోధిగా తయారయ్యింది. కరోనా తర్వాత కొత్త నిర్మాతలు సినిమా తియ్యడానికి ముందుకు రావడం మంచిదే కానీ ప్రతి విషయంలోను ఆచి తూచి అడుగులు వెయ్యాలి అన్నారు.
 
చిత్ర దర్శక,నిర్మాత శ్రీనివాస్ GLB మాట్లాడుతూ,  యూత్‌కు సంబంభించిన మూవీ "IQ". IQ అంటే మేధస్సుకు సంబందించిన చిత్రం. ఈ చిత్రంలో హీరోయిన్ చాలా ఇంటెలిజెంట్ గా కనిపిస్తుంది. మంచి కాన్సెప్ట్ తో తీస్తున్న ఈ చిత్రానికి మంచి నటీ, నటులు టెక్నిషియన్స్ అందరూ చక్కగా కుదిరారు. ఈ సినిమాకు సీనియర్ సంగీత దర్శకుడు ఘటికాచలం గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారని అన్నారు.
 
సంగీత దర్శకుడు ఘటికాచలం మాట్లాడుతూ, ఇది ఒక బ్రెయిన్‌కు సంబందించిన సినిమా. యూత్  బ్యాక్ డ్రాప్ లో తెరకేక్కిస్తున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
 
చిత్ర హీరో సాయి చరణ్ మాట్లాడుతూ, ఎటువంటి బ్యాగ్రౌండ్ లేదు కాబట్టి సినిమాలో రావడానికి మెదట భయమేసింది. కానీ సినిమాలో నటించాలనే ఆసక్తితో సాఫ్ట్ వేర్ జాబ్‌కు రిజైన్ చేసి సత్యానంద్ దగ్గర యాక్టింగ్ నేర్చుకొని వచ్చాను. ఈ రోజు నేను చేస్తున్న "IQ" సినిమాను, నన్ను ఆశీర్వదించ డానికి వచ్చిన ఇంతమంది పెద్దలను చూసి నా భయం అంతా పోయింది. ఇదే జోష్ తో సినిమాలో నటించి మంచి పేరు తెచ్చు కుంటాను అన్నారు.
GLB లక్ష్మణ్ మాట్లాడుతూ.. తమ్ముడు శ్రీనివాస్ తీస్తున్న "IQ" చిత్రం అందరికీ చేరువ అవ్వాలని కోరుతూ ఈ సినిమా అందరి హృదయాలలోకి వెళ్లి పెద్ద విజయం సాదించాలి అన్నారు.
TRS నాయకుడు పండరీ గౌడ్ మాట్లాడుతూ..కరోనా తరువాత  మంచి సబ్జెక్టు తో తీస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి.అలాగే ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్ లకు మంచి పేరు రావాలి.నిర్మాత కె. యస్. రామారవు గారు చెప్పిన జాగ్రత్తలు అన్ని పాటించాలని కోరుతున్నాను.అన్నారు.
 
చిత్ర హీరోయిన్ పల్లవి మాట్లాడుతూ..ఇది నా రెండవ చిత్రం ఈ చిత్రం లో నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. నాకిలాంటి  మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు అన్నారు. కాయగూరల లక్ష్మీ పతి సమర్పణలో  శ్రీ మల్లాది వెంకటేశ్వర ఫిలిమ్స్  పతాకంపై రూపొందుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''వరుడు''లో ఐటెం సాంగ్ ఛాన్స్ వచ్చింది.. వరలక్ష్మిలా నటించాలనుంది..