నాగశౌర్య నటించిన `కృష్ణ వ్రింద విహారి` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బ్రహ్మాజీ, సుమ మధ్య ఓ సరదాగా కన్వర్జేషన్ జరిగింది. ఇద్దరు కలిసి నవ్వులు పూయించారు. బ్రహ్మాజీ వద్దకు ప్రశ్నలు అడగడానికి వచ్చిన సుమ..'మీ మనోభావాలు ఎప్పుడైనా దెబ్బతిన్నాయా? అంటూ ప్రశ్నించింది. 
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	అందుకు బ్రహ్మాజీ 'బాగా ఆకలేస్తుంది. ఇప్పటివరకు షూటింగ్లో పాల్గొని వచ్చాను. మళ్ళీ పొద్దున్నే షూటింగ్ ఉంది' అంటూ జవాబిచ్చాడు. అటు తర్వాత 'మీ ఆస్తి వివరాలు చెప్పండి' అంటూ సుమ అడగ్గా… 'మీ రాజీవ్ కంటే ఎక్కువే!' అన్నట్టు బదులిచ్చాడు.
 
									
										
								
																	
	 
	సరే మీ ఏజ్ చెప్పండి అంటూ మళ్ళీ సుమ ప్రశ్నించగా.. 'యు నాటి ఆంటీ' అంటూ సమాధానం ఇచ్చాడు బ్రహ్మాజీ. దీంతో ఒక్కసారిగా షాకైన సుమ 'ఇది ఎటు వెళ్తుందో ఏమవుతుందో?' అంటూ కామెంట్ చేసింది. అంతా బానే ఉంది కానీ బ్రహ్మాజీ చేసిన కామెంట్లు పరోక్షంగా అనసూయని ఉద్దేశించే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.