Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ప్రేమించుకుంటున్న‌ ఇందువదన జోడీ

Advertiesment
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ప్రేమించుకుంటున్న‌ ఇందువదన జోడీ
, గురువారం, 19 ఆగస్టు 2021 (16:11 IST)
Varun Sandesh, Farnaz
వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా `ఇందువదన`. గిరిజ‌న యువ‌తిగా ఫ‌ర్నాజ్ న‌టిస్తుండ‌గా ఆ ప్రాంతానికి విధి నిర్వ‌హ‌ణ‌లో వ‌చ్చిన యువ‌కుడిగా వరుణ్ సందేశ్ న‌టిస్తున్నాడు. వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌ను వ్య‌క్తం చేసే ఓ స‌న్నివేశం పాట రూపంలో చిత్రీక‌రించారు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. ఎస్పీ చరణ్, సాహితీ చాగంటి ఈ పాటను ఆలపించారు. భాస్కరభట్ల రవికుమార్ ఈ పాటను రచించారు. 
 
పాటలో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్ చాలా అద్భుతంగా డిజైన్ చేసారు దర్శకుడు MSR. విడుదలైన క్షణం నుంచే ఇందువదన పాటకు మంచి స్పందన వస్తున్నందుకు చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉంది. వరుణ్ సందేశ్ కూడా ఇందువదన సినిమా కోసం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా.. శివ కాకాని సంగీతం సమకూరు స్తున్నారు. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నామ‌ని నిర్మాత మాధవి ఆదుర్తి  తెలియ‌జేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహేష్ బాబు ఆవిష్క‌రించిన‌ శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్(Video)