ముఖ్యమంత్రి పేషీలో ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆలోచనతో వున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన రాజీనామా ఆలోచనను ముఖ్యమంత్రికి చెప్పారని, జగన్ కూడా అరగీకరించారని ప్రచారం జరుగుతోంది.
బిజెపి తరఫున సొంత పట్టణమైన వారణాశి నుంచి శాసనసభకు పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే ఇటీవల కాలంలో ఢిల్లీకి తరచూ వెళ్తూ రాజకీయ వేదికను సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఐఐటిని ఆయన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చేశారు.
గతంలో స్వచ్ఛభారత్ మిషన్‌లో కాశీలో పనిచేసిన అనుభవం ప్రవీణ్‌కు ఉంది. అందుకే ఆయన వారణాశిని ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన తండ్రి కూడా ఓబ్రా థర్మల్ విద్యుత్ కేంద్రంలో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేశారు.
1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ప్రవీణ్ ప్రకాశ్ సహచరులు కూడా ఇప్పటికే రాజకీయాల్లో చేరడం, ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ఉన్న అశ్వినీ కూడా ప్రవీణ్ బ్యాచ్‌మేట్ కావడం విశేషం.