Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'సావిత్రి w/o సత్యమూర్తి'లో అచ్చమైన తెలుగింటి పిల్లవే పాట విడుదల

Advertiesment
'సావిత్రి w/o సత్యమూర్తి'లో అచ్చమైన తెలుగింటి పిల్లవే పాట విడుదల
, శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (19:39 IST)
Maruti, parvatesam etc
పార్వతీశం, హాస్యనటి శ్రీలక్ష్మి జంటగా నటించిన చిత్రం 'సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి'. ఏ1 మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పూరి జగన్నాథ్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన చైతన్య కొండ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమాలో తొలి పాట 'అచ్చమైన తెలుగింటి పిల్లవే'ను ప్రముఖ దర్శకులు మారుతి శుక్రవారం విడుదల చేశారు. సత్య కశ్యప్ సంగీతంలో ప్రణవం రాసిన ఈ పాటను సాయి చరణ్ ఆలపించారు. సినిమా విజయవంతం కావాలని మారుతి ఆకాంక్షించారు. ఈ సినిమా పాటల్ని ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నారు.
 
దర్శకుడు చైతన్య కొండ మాట్లాడుతూ "స్వచ్ఛమైన కుటుంబకథా చిత్రమిది. ఇరవైయేళ్ల యువకుడు అరవైయేళ్ల మహిళ ఎలా భార్యాభర్తలు అయ్యారనేది సినిమా కథ. ఇటీవల గోపీచంద్ మలినేని గారు విడుదల చేసిన టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మారుతిగారి చేతుల మీదుగా ఈ రోజు 'అచ్చమైన తెలుగింటి  సత్య కశ్యప్ చక్కటి బాణీలు ఇచ్చారు. త్వరలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటల్ని విడుదల చేస్తాం" అని అన్నారు.
 
నిర్మాత గోగుల నరేంద్ర మాట్లాడుతూ "మారుతిగారు టీజర్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకు థాంక్స్. సినిమా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఈ నెలాఖరున విడుదల చేయాలని అనుకుంటున్నాం" అని అన్నారు.
 
శివారెడ్డి, సుమన్ శెట్టి, గౌతంరాజు, అనంత్, జెన్ని, సుబ్బరాయశర్మ, కోట శంకరావు, పద్మజయంతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా),  డిజిటల్ మీడియా - విష్ణు తేజ పుట్ట,   ప్రొడక్షన్ కంట్రోలర్: కె. ఎల్లారెడ్డి, ఎడిటర్: మహేష్, నేపథ్య సంగీతం: మహిత్ నారాయణ, స్వరాలు: సత్య కశ్యప్, సినిమాటోగ్రఫీ: ఆనంద్ డోల, ప్రొడ్యూసర్: గోగుల నరేంద్ర, కథ - డైలాగ్స్ - స్క్రీన్ ప్లే - డైరెక్షన్: చైతన్య కొండ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్ర‌కాష్‌రాజ్ పేన‌ల్‌లో పోటీదారులు- డ్రెగ్‌కు వ్య‌తిరేకిని- క‌ళ్యాణి ఆరోప‌ణ‌లు నిజంకాదు