Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆకట్టుకుంటున్న సుమంత్ అహం రీబూట్ గ్లిట్చ్

Advertiesment
Sumant, Aham Reboot
, బుధవారం, 15 జూన్ 2022 (20:43 IST)
Sumant, Aham Reboot
సుమంత్ హీరోగా  న‌టిస్తున్న కొత్త సినిమా "అహాం రీబూట్". ఈ చిత్రాన్నివాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలోరఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ప్రశాంత్ సాగర్అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం "అహం రీబూట్" సినిమా విడుదల సన్నాహాల్లో ఉంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ గ్లిట్చ్ (ఫస్ట్ గ్లింప్స్) టీజర్ ను హీరో అడివి శేష్ ట్విట్టర్ ద్వారా 
విడుదల చేశారు. కాన్సెప్ట్ ను తెలుసుకొని టీమ్ ని అభినందించారు.
 పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం జూలై లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. 
 
మీ ఆలోచనలు కూడా ప్రసారం అవుతాయి.. అని రేడియో సృష్టికర్త మార్కొని చెప్పిన కొటేషన్ తో ఫస్ట్ గ్లిట్చ్ మొదలైంది. ఇందులో సుమంత్ ఆర్జే నిలయ్ పాత్రలో కనిపిస్తున్నారు. కొంతమంది నన్ను కిడ్నాప్ చేశారు కాపాడమంటూ ఒక యువతి ఆర్జే నిలయ్ కు ఫోన్ చేస్తుంది. ఇలాగే ప్రమాదంలో ఉన్న చాలా మంది యువతులు కథానాయకుడి సాయాన్నిరేడియో ద్వారా  కోరుతుంటారు. మరి వాళ్లను అతను ఎలా కాపాడాడు అనేది ఆసక్తి కరంగా ఉండబోతోంది. 
ఈ ప్రయోగాత్మక చిత్రం ఆద్యంతం  ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఒక యునిక్ కాన్సెప్ట్ ను థ్రిల్లింగ్ గా ప్రజెంట్ చేయడం అహం రీబూట్ కి బలం గా మారుతుంది అని టీమ్ నమ్ముతుంది. హీరో సుమంత్ నటన ప్రత్యేకం గా ఉండబోతోంది.
 
సంగీతం - శ్రీరామ్ మద్దూరి, సినిమాటోగ్రఫీ - వరుణ్ అంకర్ల, స్క్రిప్ట్ సూపర్ విజన్ - సుమ కార్తికేయ, ప్రొడక్షన్ డిజైన్ - ఏఆర్ వంశీ, సౌండ్ -నాగార్జున తాళ్లపల్లి, పీఆర్వో - జీఎస్కే మీడియా, నిర్మాతలు - రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు, రచన దర్శకత్వం - ప్రశాంత్ సాగర్ అట్లూరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎంఎస్ రాజు గారి సినిమా అనగానే ఎగిరి గంతేశా - హీరో రోహన్