ఇల్లీ బ్యూటీ ఇలియానా బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూకు దూరమైందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఇలియానాను నెటిజన్లు అనేక ప్రశ్నలతో తికమకపెడుతున్నారు.
తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు గట్టిగా షాకిచ్చే సమాధానం ఇచ్చింది.. ఈ పోకిరీ భామ. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో వుండే ఇలియానా.. వ్యక్తిగత, సినిమా విషయాలను కూడా పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో ఓ అభిమాని నుంచి దారుణమైన ప్రశ్న ఎదురుకొని వారికి తగ్గ సమాధానం చెప్పింది.
తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో యాస్క్ మీ ఎనీథింగ్ అనే సెషన్ మొదలుపెట్టి అభిమానులతో చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. ఓ నెటిజన్ ''మీరు మీ కన్యత్వాన్ని ఎప్పుడు కోల్పోయారు..?'' అని ప్రశ్నించాడు. దీనికి ఇలియానా.. 'ఈ విషయంలో మీ అమ్మ ఏం చెబుతుందో ముందు అడిగి తెలుసుకో' అంటూ ఘాటుగా బదులిచ్చింది. ప్రస్తుతం ఈ వాఖ్యలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి.