Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కంటెంట్ వుంటే బుజ్జి ఇలా రా అని ఆశీర్వ‌దించారు- చిత్ర‌ టీమ్

Dhanraj, G. Nageswara Reddy,  sai kartik, Garudavega Anji
, శనివారం, 3 సెప్టెంబరు 2022 (18:30 IST)
Dhanraj, G. Nageswara Reddy, sai kartik, Garudavega Anji
సునీల్, ధన్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బుజ్జి ఇలా రా’. చాందినీ అయ్యంగార్‌ హీరోయిన్‌. ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి  కథ, స్క్రీన్‌ప్లే అందించారు. రూపా జ‌గ‌దీశ్ స‌మ‌ర్పణ‌లో ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్ ఎల్ఎల్‌పి, జీ నాగేశ్వర‌రెడ్డి టీమ్ వ‌ర్క్ ప‌తాకాల‌పై  అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. గ‌రుడ‌వేగ అంజి ఈ సినిమాకి దర్శకత్వం వహించడంతో పాటు సినిమాటోగ్రాఫ‌ర్‌ గా చేశారు. సెప్టెంబర్ 2న విడుదలై ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. 
 
ఈ సంద‌ర్భంగా ధనరాజ్ మాట్లాడుతూ.. కంటెంట్ వున్న సినిమా తీస్తే చూస్తామని ‘బుజ్జి ఇలా రా' తో మరోసారి నమ్మకాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మాకు ఎంతో  ప్రోత్సహించిన మీడియాకి కృతజ్ఞతలు. మంచి సినిమా థియేటర్లో వుంది. దయచేసి మీ ఆదరణ వుండాలని కోరుతున్నాను. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా వుందని చెబుతున్నారు. సినిమా గురించి మాట్లాడుతూనే వున్నారు. మంచి సినిమాని ప్రమోట్ చేయాలని మరోసారి కోరుతున్నా. సినిమా చూడనివారు థియేటర్ కి వచ్చి సినిమా చూడండి. మిమ్మల్ని నిరాశపరచదు. మంచి సినిమా తీశాం. మంచి టాక్ వచ్చింది. థియేటర్ లో చూసి మమ్మల్ని ప్రోత్సహించండి'' అన్నారు
 
జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ..  ‘బుజ్జి ఇలా రా’కి ఎక్కడ విన్నా పాజిటివ్ టాక్ వస్తోంది. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమా మౌత్ టాక్ తో విజయం సాధిస్తుందని ముందే భావించాం. ఈరోజు అదే నిజమైయింది. మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమాని మీడియా సపోర్ట్ చేసింది. మీడియా కి థాంక్స్. ఈ సినిమాని మరో పది రోజుల పాటు ఆదరించండి. జనం వచ్చాక జనమే రిసౌండ్ వచ్చేలా చేస్తారని భావిస్తున్నాను. దయచేసి సినిమాని ప్రోత్సహించండి'' అని కోరారు.
 
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి మీడియా ఇచ్చిన సపోర్ట్ కి యూనిట్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎక్కడా చూసిన చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. కంటెంట్ ని చూసి ప్రేక్షకులు థియేటర్ కి వస్తున్నారు. ‘బుజ్జి ఇలా రా’ మంచి కంటెంట్ వున్న చిత్రం. ఇలాంటి చిత్రాలు ఆదరిస్తే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి'' అన్నారు
 
అంజి మాట్లాడుతూ.. ‘బుజ్జి ఇలా రా సూపర్ టాక్ వచ్చింది. ఈ మధ్య కాలంలో బెస్ట్ థ్రిల్లర్ అని రివ్యూలు వచ్చాయి. అందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాని మరింత ప్రోత్సహించాలని కోరారు
 
నిర్మాతలు మాట్లాడుతూ.. మా సినిమాకి మంచి టాక్ వచ్చింది. మా సినిమాని ప్రమోట్ చేసిన మీడియాకి కృతజ్ఞతలు. థియేటర్ల సంఖ్య పెరుగుతుంది. మీడియా, ప్రేక్షకులు సినిమాని మరింత ఆదరించి పెద్ద విజయం చేయాలి'' అని కోరారు.
 
సాయి కార్తిక్ మాట్లాడుతూ..   ‘బుజ్జి ఇలా రా’ మంచి టాక్ వచ్చింది. థియేటర్ లో చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమాని ఇంకా పెద్ద హిట్ చేయాలి. మీ అందరి సహకారం కావాలి'' అని కోరారు
శ్రీకాంత్ అయ్యంగర్ : మీడియా ప్రోత్సాహం లేనిది సినిమా మనుగడ సాధించలేదు. ఈ చిత్రానికి మరింత సహకారం అందించాలని కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకే ఒక జీవితం మనసుని హత్తుకునే సినిమా - అమ‌ల‌, శ‌ర్వానంద్‌