Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు టీవీ రైటర్స్‌ అసోసియేషన్‌ కార్డుల డిస్ట్రిబ్యూషన్‌

telugu tv writers
, ఆదివారం, 27 ఆగస్టు 2023 (13:34 IST)
తెలుగు టీవీ రైటర్స్‌ అసోసియేషన్‌ సభ్యులకు ఐడెంటిటీ కార్డుల డిస్ట్రిబ్యూషన్‌ ఇటీవల ఫిల్మ్‌ఛాంబర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండర్‌ ప్రెసిడెంట్‌ ఉషారాణి, గౌరవ అధ్యక్షలు సాయి మాధవ్‌ బుర్రా, అధ్యక్షులు కొమ్మనాపల్లి గణపతిరావు, ప్రధాన కార్యదర్శి శశాంక్‌ తదితరులు పాల్గొన్నారు. క్రిష్‌ ముఖ్య అతిథిగా హాజరై కార్డులను పంపిణీ చేశారు. 
 
అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘నాకు రచయితలు అంటే ఎంతో గౌరవం. టీవీ రచయితలు ఓపిక ఎక్కువ ఉంటుంది. నవల, సినిమా కథలు రాయడానికి  చాలా సౌలభ్యం ఉంటుంది. కానీ టెలివిజన్‌కి రాయాలంటే చాలా సవాళ్లు ఉంటాయి అని అన్నారు. 
 
ఉషారాణి మాట్లాడుతూ... రైటర్స్‌ కోసం రైటర్స్‌ అనే నినాదంతో ఈ అసోసియేషన్‌ మొదలుపెట్టా. అంతా ఐక్యమత్యంగా ముందుకు వెళ్లాలని కోరుతున్నా అని అన్నారు. సాయి మాధవ్‌ బుర్రా మాట్లాడుతూ... 69 ఏళ్ల జాతీయ పురస్కారాల చరిత్రలో తెలుగు వారు ఎవరికీ ఉత్తమ నటుడు అవార్డుల రాలేదు. మొదటిసారి మనతెలుగు హీరో అల్లు అర్జున్‌కి ఈ అవార్డు వరించడం, నేను మాటలు రాసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి ఆరు అవార్డులు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఉత్తమ నటుడు ఘనత సాధించిన అల్లు అర్జున్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది. తెలుగు టీవీ రైటర్స్‌ అసోసియేషన్‌ ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే ఎంతో ఘనత సాధించామని అన్నారు. 
 
ఇంకా ఈ కార్యక్రమంలో ట్రెజరర్‌ వెంకటేష్‌ బాబు, వైస్‌ ప్రెసిడెంట్‌: బివి రామారావు, జాయింట్‌ సెక్రెటరీ: ప్రజా ప్రభాకర్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మహేంద్ర వర్మ, అంజన్‌ మేగోటి, ఫణి రాజ్‌, రాంప్రసాద్‌, తదితర తెలుగు టీవీ రచయితలు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంగనా రనౌత్ చాలా బోల్డ్ పర్సన్ .. ఎలా ఉంటారోనని ఒకటే టెన్షన్ : రాఘవ లారెన్స్...