Mirayi sucess team at vijayawada
కొన్ని రోజులుగా సరియైన విజయాలు లేక ఇబ్బంది పడుతున్న తెలుగు చిత్ర పరిశ్రమ మిరాయి తో అద్భుతమైన విజయాన్ని అందుకోవడం అందులోనూ మన పురాణ ఇతిహాసాల్ని దృష్టిలో పెట్టుకుని తీసిన ఈ చిత్రం ఇంత విజయనందుకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అద్భుతమైన విజయాన్ని అందుకున్ననిర్మాత విశ్వ ప్రసాద్ కి దర్శకుడు కార్తీక్ హీరో తేజకి అభినందనలు తెలియజేస్తున్నాను. తేజకు బంగారు భవిష్యత్తు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.
సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజైన ఈ చిత్రం బ్రహ్మండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుని అద్భుతమైన కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ విజయవాడలో బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించారు. మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మల్యే రఘురామకృష్ణంరాజు, డైరెక్టర్స్ బాబీ, సందీప్ రాజ్ హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
హీరో తేజ మాట్లాడుతూ.. మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ఆడియన్స్ ది, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ది. నా వంతు ప్రయత్నం నేను చేశాను. నాకు అవకాశం ఇవ్వడమే గొప్ప వరం. అవకాశాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాను. ఈ సక్సెస్ ని నేను ఎంతో బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ చేసే సినిమాల్లో కూడా అంతే కృషి చేస్తాను. ఈ సినిమాకి ఎంతో వెయిటేజ్ యాడ్ చేసిన మనోజ్ గారికి థాంక్యూ. ఈ సినిమా కథ ఆయనకి ఎంతో నచ్చబట్టి సినిమాకి ఎంతో బలాన్ని చేకూర్చాని తెలిపారు.
డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ, నేను దర్శకుడు కాకముందే మనోజ్ అన్న పరిచయం. నాకు ఫస్ట్ డైరెక్షన్ ఛాన్స్ ఆఫర్ చేసింది కూడా తనే. ఇంత గ్యాప్ లో వచ్చిన తర్వాత కూడా అదరగొట్టేసారు. తను అంత బలంగా ఉన్నారు కాబట్టే చివరి నిమిషం వరకు థియేటర్ హోల్డ్ అయింది. వెల్కమ్ బ్యాక్ మనోజ్ అన్న. కార్తీక్ ఈ సినిమాకి కెమెరామెన్ గా డైరెక్టర్ గా స్క్రీన్ రైటర్ గా తీర్చిన దిద్దిన విధానం అద్భుతం. తను పడిన కష్టానికి ఫలితం దక్కిం.ది ఈ సక్సెస్ కి ప్రధాన కారణం విశ్వప్రసాద్ గారు. ఈ సినిమాతో నిర్మాతగా విశ్వ ప్రసాద్ గారి అమ్మాయి కృతి ప్రసాద్ గారు పరిచయమయ్యారు. తొలి సినిమాతో ఇంత అద్భుతమైన విజయం అందుకున్న వారికి అభినందనలు.
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూసిన తర్వాత మా అమ్మగారు నన్ను పట్టుకుని చాలా ఎమోషనల్ అయిపోయారు. ఎన్నో సంవత్సరాల తర్వాత నా విషయంలో మా అమ్మ కళ్ళల్లో ఆనందం చూశాను. అందరికీ ఫోన్ చేసి మా అబ్బాయి హిట్ కొట్టడని చెప్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. అలాగే మా అక్క కూడా చాలా ఆనంద పడింది. నా ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూస్తుంటే ఆ అనుభూతి జీవితంలో మర్చిపోలేను. నా విజయాన్ని మీ విజయంగా తీసుకుంటూ నన్ను ముందుకు నడిపిస్తున్న అభిమానులకు స్నేహితులకు అందరికీ పాదాభివందనం. ఎన్ని జన్మలెత్తినా ఈ అభిమానం ఉంటే చాలు. కార్తీక్ గారు అందరి ఆకలి తీర్చేశారు. విశ్వ గారు పట్టుదలతో ఎన్ని అడ్డంకులు వచ్చినా సినిమాని చాలా అద్భుతంగా నిర్మించారు. ఆయన మా అందరి వెనుక నిలబడ్డారు. నా తమ్ముడు తేజ సజ్జ ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలని భగవంతుని కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమాకి చాలా అద్భుతమైన విఎఫ్ఎక్స్ వర్క్ జరిగింది. దీనికి స్పెషల్ థాంక్స్ రాజా సాబ్ మూవీ. ఆ సినిమాకి విఎఫ్ఎక్స్ చేయకపోతే ఇంత క్యాపబిలిటీ బిల్డ్ చేయడం వీలయ్యేది కాదు. సినిమాకి వాయిస్ ఇచ్చిన ప్రభాస్ గారికి థాంక్యూ. సినిమాలో పనిచేసిన అందరికీ థాంక్యూ. అందరూ అందరూ థియేటర్స్ లో సినిమా చూడాలని కోరుకుంటున్నాను.