నా కంటే సల్మాన్, అమీర్ పెద్ద స్టార్లు.. మా మధ్య గొడవల్లేవ్!: షారూఖ్ ఖాన్
బాలీవుడ్‌లో బిగ్ బీ అమితాబ్ తరువాత అంతటి స్టార్ డమ్ ఉన్న హీరోలెవరంటే టక్కున గుర్తుకువచ్చే పేర్లు... షారూఖ్, సల్మాన్, అమీర్ ఖాన్‌ల పేర్లు వినిపిస్తాయి. ఈ ముగ్గురూ ఖాన్‌లు తమదైన శైలిలో బాలీవుడ్‌లో దూసుక
బాలీవుడ్‌లో బిగ్ బీ అమితాబ్ తరువాత అంతటి స్టార్ డమ్ ఉన్న హీరోలెవరంటే టక్కున గుర్తుకువచ్చే పేర్లు... షారూఖ్, సల్మాన్, అమీర్ ఖాన్‌ల పేర్లు వినిపిస్తాయి. ఈ ముగ్గురూ ఖాన్‌లు తమదైన శైలిలో బాలీవుడ్‌లో దూసుకుపోతున్నారు. తిరుగులేని పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. తాజాగా స్టార్‌డమ్‌పై అమీర్ ఖాన్ మాట్లాడుతూ... తన కంటే సల్మాన్, షారూఖ్ ఖాన్‌లు పెద్ద స్టార్‌లు అన్నాడు.
అయితే దీనిపై స్పందించిన షారూఖ్ 'మా మధ్య సత్సంబంధాలున్నాయి. మేం ముగ్గురం చాలా ప్రేమగా సరదాగా ఉంటాం. ''నా కంటే సల్మాన్, అమీర్ పెద్ద స్టార్లని నేను భావిస్తున్నాను. మా ముగ్గురిలో ఎవరే సినిమా చేసినా పరస్పరం అభినందించుకుంటామ'ని షారూఖ్ పేర్కొన్నాడు.