Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాకు ప‌ర్స‌న‌ల్ ఎజెండాలేదు- అన్నింటికీ ఫిలిం ఛాంబ‌ర్ సుప్రీం- దిల్ రాజు

Dil Raju, Damodar Prasad, C Kalyan, Prasanna Kumar, Mohan Vadlapatla
, గురువారం, 4 ఆగస్టు 2022 (16:46 IST)
Dil Raju, Damodar Prasad, C Kalyan, Prasanna Kumar, Mohan Vadlapatla
నా గురించి సోష‌ల్‌మీడియాలో, యూట్యూబ్‌లో ర‌క‌ర‌కాలుగా రాస్తున్నారు. నాకు ప‌ర్స‌న‌ల్ అజెండా లేదు. అంద‌రి నిర్మాత‌ల కోస‌మే మేం షూటింగ్‌లు బంద్ పాటిస్తూ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకుంటున్నామ‌ని దిల్ రాజు తెలిపారు. గ‌త కొద్దిరోజులుగా దిల్ ఆద్వ‌ర్యంలో ఛాంబ‌ర్‌లోని అన్ని శాఖ‌ల‌తో మీటింగ్‌లు జ‌రిపారు. ఈ వివ‌రాల‌ను గురువారంనాడు వారు మీడియాకు వీడియోను విడుద‌ల చేశారు. 
 
గురువారంనాడు ఛాంబ‌ర్‌లో జ‌రిగిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేరెంట్ బాడీలో నిర్మాత దిల్ రాజు , తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ , ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సి కళ్యాణ్ , ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీలు ప్రసన్నకుమార్,  మోహన్ వడ్లపట్ల పాల్గొన్నారు. 
 
ఈ సంద‌ర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, తెలుగు ఫిలిం ఛాంబ‌ర్‌, తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ అంద‌రం ఒక్క‌టే. తెలంగాణ ఛాంబ‌ర్ అద్య‌క్షుడు అనుప‌మా రెడ్డి కూడా మాతోనే వున్నారు. మీకు ఏది కావాల‌న్నా ఛాంబ‌ర్ నుంచి నోట్ వ‌స్తుంది. వారం, ప‌దిరోజులు మీడియా ఓపిక ప‌ట్టండి. ఏది ప‌డితే అది రాయ‌కండి. నా గురించి ర‌క‌ర‌కాలుగా రాస్తున్నారు. అయినా నాకు బాద‌లేదు. నేను నిర్మాత‌లంద‌రి కోస‌మే ప‌నిచేస్తున్నాం. ముఖ్యంగా ఈ స‌మ‌స్య‌ల గురించి ప‌లు క‌మిటీలు వేసి సాల్వ్ చేసే ప‌నిలో వున్నాం.
 
1. ఓటిటి, విపిఎఫ్ చార్జీలు, వేత‌నాలు, ధియేటర్ ల సమస్య ల పరిష్కారానికి నాలుగు కమిటి లను ఏర్పాటు చేశాం. ఇలా అన్ని స‌మ‌స్య‌లు అంద‌రితో చ‌ర్చించి ప‌రిష్క‌రించాలంటే ఇలా మాకే మేం బంద్ పాటిస్తూనే అంద‌రం క‌లిసి మాట్లాడుకోగ‌లం. అందుకే బంద్ చేశాం.
2. మా నిర్మాత‌ల మ‌ద్య గొడ‌వ‌లు లేవు.
3. చిన్న‌, పెద్ద సినిమాల‌కు థియేట‌ర్ల‌లో ప‌న్ను విష‌యంలో ఒక‌మాట‌పై రావాడానికి చ‌ర్చిస్తున్నాం.
4. ఓటీటీ వ‌ల్ల తెలుగు సినిమా క‌థ‌ల్లో మార్పు రావాల‌ని భావించి. గ‌తంలోలా క‌థ‌లు వుంటే ప్రేక్ష‌కులు థియేటర్ల‌కు రావ‌డంలేదు. 
 సినీ పరిశ్రమకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్సె సుప్రీప్ అని తెలిపిన దిల్ రాజు , చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అన్నీ సినిమాల చిత్రీకరణలు ఆగాయని, త్వరలోనే సమస్యలను పరిష్కరించి , షూటింగ్ లను ప్రారంభిస్తామని వివరణ ఇచ్చారు...
 
సి. క‌ళ్యాణ్ మాట్లాడుతూ,  నిర్మాత‌లంద‌రి స‌హ‌కారంతోనే షూటింగ్‌ల‌ను ఆపుకుని ముందుకు వెళుతున్నాం. దీనిలో బంద్‌లు, స్ట్ర‌యిక్‌లు లేవు. నిర్మాత‌లంద‌రి విన్నం. య‌జ్ఞంలా మొద‌లుపెట్టాం. ఎవ‌రో ఏదోఒక‌టి చెబుతారు. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రాం అయితేనిర్మాత‌ల‌కు చాలా రిలీఫ్ వ‌స్తుంది. ద‌య‌చేసి మ‌న క‌ల్లు మ‌నం పొడుగుకోవ‌ద్దు. వారం, ప‌దిరోజులు ఓపిక ప‌ట్టండి. ర‌క‌ర‌కాలుగా క‌మిటీలు వేసుకుని. ప‌నిని విడ‌వగొట్టి.. స‌మ‌స్య‌లు తెలుసుకుంటాం. చెప్పుడు మాట‌లు విన‌దొద్దు.మేమంతా ఒక్క‌టే. మాలో వైరుద్యాలులేవు.మీడియాలో గిల్డ్ అనేది రాయ‌వ‌ద్దు. తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ ఆప్ కామ‌ర్స్ ఆద్విర్యంలోనే అన్ని మీటింగ్‌లు జ‌రుగుతున్నాయి దిల్‌రాజు తోపాటు అంద‌రూం వున్నారు. ప‌నులు బాగాజ‌ర‌గాల‌ని అంద‌రం కోచుకుంటున్నాం అని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డైరక్టర్ శంకర్ కుమార్తెకు ఆఫర్ల వెల్లువ... పాట కూడా పాడిందట