Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రియాంకా చోప్రాకు దీర్ఘకాలిక వ్యాధి.. అదేంటంటే?

బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన నటి ప్రియాంకా చోప్రా. అమెరికా సింగర్ నిక్ జోనస్‌ను వచ్చే నెలలో వివాహం చేసుకోనుంది. వీరిద్దరికీ ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగిపోయింది.

ప్రియాంకా చోప్రాకు దీర్ఘకాలిక వ్యాధి.. అదేంటంటే?
, మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (16:52 IST)
బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన నటి ప్రియాంకా చోప్రా. అమెరికా సింగర్ నిక్ జోనస్‌ను వచ్చే నెలలో వివాహం చేసుకోనుంది. వీరిద్దరికీ ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. అయితే, ప్రియాంకా చోప్రా ఇపుడు ఓ సంచలన విషయాన్ని వెల్లడించింది. తాను దీర్ఘకాలికంగా అస్తమా వ్యాధితో బాధపడుతున్నట్టు చెప్పుకొచ్చింది.
 
ప్రస్తుతం గ్లోబ‌ల్ స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న ప్రియాంక చోప్రా ఐదేళ్ళ వ‌య‌స్సు నుంచే ఆస్త‌మా సమస్య నుంచి బాధపడుతున్నట్టు  తెలిపింది. ఈ విష‌యాన్ని సిప్లా కంపెనీకి చెందిన ఇన్హేలర్లకు ప్ర‌చార‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న క్ర‌మంలో చెప్పుకొచ్చింది. 
 
"నాకు ఆస్త‌మా ఉంద‌నే విష‌యం ద‌గ్గ‌ర‌గా ఉన్న చాలా మందికి తెలుసు. ఐదేళ్ళ నుండి ఈ వ్యాధితో బాధ‌ప‌డుతున్నాను. మా అమ్మ డాక్ట‌ర్ కాబ‌ట్టి ఇన్హేల‌ర్‌ని సూచించింది. ఇది వాడ‌టం మొద‌లు పెడితే అది ఒక అల‌వాటుగా మారుతుంద‌ని అంద‌రు చెప్పారు. కానీ అలాంటిదేమి లేదు. దాని వ‌ల‌న స్వేచ్చ‌గా ఊపిరి పీల్చుకోవ‌చ్చు. ఆస్త‌మా న‌న్ను అదుపు చేసే లోపు దానిని నేను అదుపు చేయాల‌ని అనుకున్నాను. నా వ‌ద్ద ఇన్హేల‌ర్ ఉన్నంత వ‌ర‌కు ఆస్త‌మా నన్ను ఎద‌గ‌నివ్వ‌కుండా ఆప‌లేదు'' అని సోష‌ల్ మీడియా ద్వారా ఆమె వివరణ ఇచ్చింది.
 
పైగా, ఇన్హేలర్ ద్వారా ఎలాంటి స‌మ‌స్య‌లు తలెత్త‌వు. ఇది ఆస్త‌మాని పూర్తిగా త‌గ్గించ‌క‌పోయిన‌, శ్వాస తీసుకోవ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంద‌ని వీడియో ద్వారా ప్రియాంక చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో 'ది స్కై ఈజ్‌ పింక్‌' చిత్రంలో నటిస్తుంది ప్రియాంక‌. ఇందులో ఫర్హాన్‌ అక్తర్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వీర భోగ వసంతరాయలు... ఈ పాట ప్రణయ్‌కి అంకితం..