Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరు 'సైరా'తో 'వార్‌'కి సిద్ధమైన హృతిక్ రోషన్..

Advertiesment
Hrithik
, మంగళవారం, 27 ఆగస్టు 2019 (17:13 IST)
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం 'సైరా'. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ సోషియల్ మీడియాలో దుమ్ములేపుతోంది. ఈ చిత్రంలో చిరు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను పోషిస్తున్నాడు. భారీ వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రంలో బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌తో పాటు, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, తమన్నా, రవికిషన్ తదితరులు నటిస్తున్నారు. 
 
నయనతార లీడ్ హీరోయిన్‌గా నటిస్తోంది. హీరో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని రేసుగుర్రం చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రం ఏకకాలంలో 5 భాషల్లో విడుదల కానుంది. 
 
అయితే ఇప్పుడు ఈ చిత్రానికి ఒక చిక్కు వచ్చి పడింది. అదేమిటంటే..ఇది ఒక పీరియాడికల్ మూవీ. అందువల్ల భారీ వ్యయంతో తెరకెక్కించారు. ఇలాంటి చిత్రాలకు ఏ సినిమాలు పోటీకి రావు. ఒకవేళ వస్తే, రిలీజ్ తేదీని ముందుకు మార్చడమో లేదా వాయిదా వేసుకోవడమో చేస్తుంటారు. గతంలో బాహుబలి చిత్రం విడుదల సమయంలోనూ ఇదే జరిగింది. బాహుబలి కోసం మహేష్ బాబు అంతటి సూపర్‌ స్టార్ తన శ్రీమంతుడు సినిమా విడుదలను వాయిదా వేసుకున్నాడు. అయితే ఇప్పుడు సీన్ మారింది.
 
బాలీవుడ్‌లో హీరో హృతిక్ రోషన్ తాజా చిత్రం వార్ కూడా సైరా చిత్రం విడుదల రోజున రిలీజ్ కానుండడం పెద్ద చర్చకు దారి తీసింది. సైరా చిత్రం వసూళ్లపై వార్ చిత్రం ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదే జరిగితే సైరాకు కొంత వరకు మైనస్ అనే చెప్పవచ్చు. చిరంజీవి రీఎంట్రీలో ఖైదీ నెం.150 తర్వాత భారీ హిట్‌పై కన్నేసాడు. మరోవైపు హృతిక్ రోషన్ సరైన హిట్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాడు. 
 
హృతిక్ నటించిన గత చిత్రాలు మొహెంజోదారో, కాబిల్, సూపర్ 30 వంటివి బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ఇప్పుడు ఆశలన్నీ వార్ చిత్రంపైనే పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో మరో హీరో టైగర్ ష్రాఫ్ నటిస్తుండడంతో బాలీవుడ్ ప్రేక్షకులలో మరింత ఆసక్తి నెలకొని ఉంది. ఈ చిత్రం కూడా వివిధ భారతీయ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
 
ఈ రెండు చిత్రాలు అక్టోబర్ 2న రిలీజ్ అవుతుండడంతో బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్ధమే జరిగేలా కనిపిస్తోంది. వీటిలో ఏ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తుందో చూడాలంటే గాంధీ జయంతి వరకు ఆగాల్సిందే మరి..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కీర్తి సురేష్ 'మిస్ ఇండియా'... ఎప్పుడైంది? ఏంటి సంగతి?