Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్ 4 నాగ్ ప్రొమో ఎలా ఉండబోతుంది..?

Advertiesment
బిగ్ బాస్ 4 నాగ్ ప్రొమో ఎలా ఉండబోతుంది..?
, శుక్రవారం, 31 జులై 2020 (15:44 IST)
బుల్లితెరపై బాగా సక్సెస్ అయిన రియాల్టీ షో అంటే ఠక్కున అందరూ చెప్పేది బిగ్ బాస్. ఇప్పటివరకు బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2, బిగ్ బాస్ 3 సీజన్ పూర్తవ్వడం.. ఈ మూడు సీజన్లు సక్సెస్ అవ్వడం తెలిసిందే. మూడవ సీజన్‌కి టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్‌గా ఉండడం.. అది రికార్డు స్ధాయిలో టీఆర్పీ రేటింగ్ దక్కించుకోవడంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో అందరి దృష్టి సీజన్ 4 పై పడింది.
 
ప్రజెంట్ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ 4 రాబోతుంది. అందుచేత ఈసారి బిగ్ బాస్ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది. అయితే... ఆగష్టు చివరి వారంలో బిగ్ బాస్ 4 సీజన్ స్టార్ట్ కానుంది. అందుచేత ఇప్పటి నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. ఇప్పుడు ఈ సీజన్‌కు గాను నాగ్ పైన అదిరిపోయే టీజర్‌ను కట్ చేస్తున్నట్టు తెలిసింది.
 
ఈ వార్త తెలిసినప్పటి నుంచి ప్రొమో ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ ఎక్కువైంది. దీనిని అతి త్వరలోనే విడుదల చేయనున్నారు. మరి... నాగ్ పైన షూట్ చేస్తున్న ఈ ప్రొమో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్‌డౌన్ నాకు మంచి గుణపాఠం నేర్పిందంటున్న సినీ నటి సమంత