Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగ్.. అతనిపై సీరియస్ అయ్యారా..? ఇంతకీ ఏం జరిగింది..?

Advertiesment
నాగ్.. అతనిపై సీరియస్ అయ్యారా..? ఇంతకీ ఏం జరిగింది..?
, ఆదివారం, 26 జులై 2020 (16:38 IST)
కరోనా కారణంగా సినిమా హాల్స్ మూసివేయడం తెలిసిందే. దీంతో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉన్న కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతాయి అనుకున్నారు కానీ... నిర్మాతలు హీరోలు ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపించడం లేదు.

ఉప్నెన, వి, నిశ్శబ్దం చిత్రాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి కానీ... నిర్మాతలు డైరెక్ట్ గా థియేటర్ లోనే రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు కానీ.. ఎంత పెద్ద ఆఫర్ ఇచ్చినా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఒప్పుకోవడం లేదు.
 
ఇక అసలు విషయానికి వస్తే... అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ఈ చిత్రాన్ని బన్నీ వాసు - వాసు వర్మ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే.. ఈ మూవీకి సంబంధించి ఇంకా కొంత టాకీ, రెండు పాటలు చిత్రీకరించాల్సివుందని సమాచారం. 
 
ఇదిలా ఉంటే... ఈ సినిమాని ఓటీటీ ద్వారా రిలీజ్ చేద్దామని.. ఈ సినిమాకి భారీ అమౌంట్ ఇప్పిస్తానని.. అల్లు అరవింద్ గారికి ఈ విషయం చెప్పి ఒప్పించాలని నాగార్జునకు చెప్పారట ఓ వ్యక్తి.
 
ఇండస్ట్రీకి సంబంధించిన ఈ వ్యక్తి అల్లు అరవింద్‌కి కూడా బాగా తెలుసు. అయితే... నాగార్జున ద్వారా వెళితే వర్కవుట్ అవుతుంది అనుకుని వెళ్లాడట. 
 
అయితే... ఈ విషయం చెప్పిన వెంటనే నాగ్ కి బాగా కోపం వచ్చిందట. వెంటనే... గెట్ అవుట్ అన్నంత పని చేసారట. ఎప్పుడూ కూల్ గా ఉండే నాగ్ ఒక్కసారిగా ఇలా సీరియస్ అవ్వడంతో వెంటనే అక్కడ నుంచి ఆ వ్యక్తి జంప్ అయ్యాడని టాలీవుడ్ టాక్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వాతంత్ర్య దినోత్స‌వం కానుక‌గా ‘జోహార్’.. ఆహాలో విడుదల