Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సస్పెన్స్ థ్రిల్లర్ తో హింట్ ..? మూవీ

Advertiesment
Hint..? Movie, team with SVN Rao
, బుధవారం, 31 మే 2023 (15:05 IST)
Hint..? Movie, team with SVN Rao
మైత్రి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై జయరామ్ తేజ ను హీరోగా పరిచయం చేస్తూ చందూ బిజుగ దర్శకత్వం వహిస్తున్నహర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ  హింట్‌ ..? . మైత్రి రెడ్డి , రిజ్వాన్ ఆహ్మద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ పోస్టర్ లాంచ్ హైద్రాబాద్ లో ఘనంగా జరిగింది..ఈ కార్యక్రమంలో  నవ్యాంద్ర ఫిల్మ్ చాంబర్ అధ్యక్షులు  ఎస్‌వీఎన్‌ రావు , హీరో కృష్ణ సాయి పాల్గోన్నారు.. 
 
అనంతరం ఎస్‌వీఎన్‌ రావు మాట్లాడుతూ ... సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ తో మైత్రి మూవీ క్రియేషన్స్ మైత్రిగారు హింట్ సినిమా నిర్మించడం శుభసూచికం... గతంలో ఓ సినిమా ను నిర్మించారు..వారి బ్యానర్ లో మరో సినిమా రూపోందించడం గొప్ప విషయం అన్నారు.. హింట్ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.
 
హీరో కృష్ణసాయి మాట్లాడుతూ, మైత్రి మూవీ క్రియేషన్స్ లో వస్తున్న రెండో సినిమా హింట్ మూవీ.. నిర్మాత మైత్రి రెడ్డి ద్వారా కథ విన్నాను చాలా బాగుంది... ఈ సినిమా నిర్మాతలకు మంచి విజయాన్ని ...టెక్నిషియన్స్ కు మంచి పేరు తీసుకరావాలని కోరుకుంటున్నా అన్నారు...
 
డైరెక్టర్ చందూ బిజుగ మాట్లాడుతూ ... 15 సంవత్సరాలకు పైగా టీవి ఇండస్ట్రీలో దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవం ఉంది... ప్రోడ్యూసర్ మైత్రి రెడ్డి గారు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది... ఆ కథ కు మంచి  స్క్రీన్ ప్లే , సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమింట్స్ జోడించి సినిమా ను రూపోందిస్తున్నాము... ఈ సినిమా ద్వారా మంచి దర్శకుడిగా ప్రూవ్ చేసుకుంటానని  అన్నారు...
 
హీరో జయరామ్ తేజ మాట్లాడుతూ .... సీరియల్ నటుడిగా కోనసాగుతున్నా ...హింట్ మూవీ లో హీరోగా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు .... మంచి కథ ద్వారా నేను హీరో గా పరిచయం అవడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు..
 
నిర్మాత మైత్రి రెడ్డి మాట్లాడుతూ, నేను చెప్పిన కథ ను దర్శకుడు చందూ బిజుగ మంచి స్క్రీన్ ప్లే , సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్  తో తీర్చిదిద్దాడు..అందుకే దర్శకత్వ బాధ్యతలు తనకే  అప్పగించాను ... సీరియల్స్ లో  జయరామ్ తేజ నటన చూసి ...హింట్ మూవీలో హీరో గా అవకాశం ఇచ్చాము... ప్రస్తుతం ఉన్న ట్రెండ్ గా అనుగుణంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా నిర్మిస్తామని అన్నారు... సీనియర్ ఆరిస్ట్ ల డేట్స్  కన్పారమ్ అయ్యాక సింగిల్ షెడ్యూల్ లో సినిమా పూర్తిచేస్తామని...మరికొంత మంది నటీనటులు అండ్ టెక్నిషియన్స్ వివరాలు త్వరలో తెలియజేస్తామని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో డియర్ జిందగీ ప్రారంభం