Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెండో చిత్రానికే కమిట్‌మెంట్ అడిగారు.. నటి కస్తూరీ ఆరోపణలు

Advertiesment
kasthuri

ఠాగూర్

, శనివారం, 14 సెప్టెంబరు 2024 (09:19 IST)
కేరళ చిత్రపరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ నివేదిక తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ నివేదిక బయటకు వచ్చిన తర్వాత అనేక మంది హీరోయిన్లు ఇండస్ట్రీలో గతంలో వారు ఎదుర్కొన్న లైంగిక వేధింపులను, చేదు అనుభవాలను మీడియా ముందు బహిర్గతం చేస్తూ వస్తున్నారు. తాజాగా నటి కస్తూరి కూడా తాను ఎదుర్కొన్న అనుభవాన్ని వెల్లడించారు. తన రెండో సినిమాలోనే దర్శకుడు తనను కమిట్మెంట్ అడిగారని చెప్పడం తీవ్ర సంచలనం అయ్యింది. తాను నటించిన రెండో చిత్రానికే ఓ దర్శకుడు కమిట్‌మెంట్ అడిగారని చెప్పారు. 
 
తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సినిమా దర్శకుడు తనతో అనుచితంగా మాట్లాడి కమిట్మెంట్ కావాలని, అడ్జస్ట్మెంట్ చేసుకోమని అడిగాడని చెప్పింది. అతని ఉద్దేశం అర్ధమై షూటింగ్ స్పాట్‍‌‌లోనే అందరి ముందు తిట్టానని చెప్పింది. తాను అతనికి సహకరించలేదు కాబట్టి సినిమా మొదటి దశ పూర్తయిన తర్వాత కూడా తనను సినిమా నుండి తప్పించారని వెల్లడించింది. ఫస్ట్ ఫేజ్ షూటింగ్ అయ్యాక తాను సన్నగా ఉన్నానన్న కారణంతో తప్పించారని చెప్పింది. తాను ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయిని, తన తల్లి న్యాయవాది.. తనకే చిత్ర పరిశ్రమలో ఇలాంటి సంఘటనలు జరిగాయని తెలిపింది.
 
సినిమాలపై ఆధారపడి జీవనోపాధి కోసం కొందరు మహిళలు ఇక్కడికి వస్తుంటారని, అలాంటి వారు అమ్మాయిలను ఎలా తయారు చేస్తారో ఆలోచించుకోవాలని అన్నారు. కావున సినిమాల్లోకి రావాలనుకున్న అమ్మాయిలు ధైర్యంగా, చాలా జాగ్రత్తగా ఉండాలని కస్తూరి సూచించారు. కాగా, మోడలింగ్ రంగం నుండి సినిమాల్లోకి వచ్చిన కస్తూరి.. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ మొదలైన దక్షిణ భారత భాషల సినిమాల్లో నటించారు. గృహ లక్ష్మి అనే సీరియల్‌తో తెలుగు ప్రజలకు సుపరిచితురాలయింది. ఈ సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయిన కస్తూరికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబై నటి కాందబరి జెత్వానీ కేసు : ఏసీపీ - సీఐలపై సస్పెన్ వేటు