రామ్ గోపాల్ వర్మ కొండా సినిమాతో పలు సినేమాలు చేసిన హీరో త్రిగుణ్ ఇప్పుడు కన్నడలో ప్రవేశించారు.ఆ సినిమాయే లైన్ మ్యాన్. వి.రఘుశాస్త్రి దర్శకత్వంలో తెరకెక్కతోన్న ఈ సినిమాను కన్నడ, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతుండటం విశేషం. మాండ్య ప్రాంతంలోని సమీప గ్రామాల్లోని వాతావరణాన్ని చక్కగా ఆవిష్కరిస్తూ కామెడీ ప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈ క్రమంలో లైన్ మ్యాన్ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషనల్ కంటెంట్ అందరిలోనూ ఆసక్తిని మరింతగా పెంచింది. ఓ లైన్ మ్యాన్ జీవితంలోని ముఖ్యమైన, ఆసక్తికరమైన అంశాలను ఇందులో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గమనిస్తే రెండు కరెంట్ స్తంభాలతో క్రియేటివ్‌గా డిజైన్ చేయబడింది. ఇక లైన్ మ్యాన్ ఈ స్తంభాలను ఎక్కడానికి ప్రధానంగా ఉపయోగించే నిచ్చెనను మన కథానాయకుడు త్రిగుణ్ పట్టుకుని ఉన్నారు. అలాగే సినిమాలోని ఇతర పాత్రలను కూడా ఈ పోస్టర్‌లో మనం గమనించవచ్చు. వీరి జీవితాలకు, లైన్ మ్యాన్ జీవితానికి ఉన్న సంబంధం ఏంటనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే మరి.
లైన్ మ్యాన్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌తో ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్ సహా ఇతర ప్రధానాంశాలు ఎలా ఉంటాయో చూడాలనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, కన్నడ భాషల్లో మార్చి 15న గ్రాండ్ రిలీజ్ చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో త్రిగుణ్ కన్నడ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టటమే కాకుండా, ఇలాంటి కథాంశంతో సినిమా చేయటం ద్వారా ప్రాంతీయత భావనను అందరిలోనూ తొలగించి భాషా పరమైన అడ్డంకులను అధిగమించవచ్చనని తెలియజేయటానికి ఇదొక నిదర్శనంగా చెప్పొచ్చు. సినిమాపై ఆసక్తిని పెరగటం అనేది మంచి పరిణామంగా మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా మ్యాండ ప్రాంతంలోని లైన్ మ్యాన్ జీవితాన్ని మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు.