Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బస్టాండ్, రైల్వేస్టేషన్‌లలో అప్పడాలు అమ్ముకుంటున్న హీరో..

బస్టాండ్, రైల్వేస్టేషన్‌లలో అప్పడాలు అమ్ముకుంటున్న హీరో..
, శుక్రవారం, 28 జూన్ 2019 (16:55 IST)
స్టార్ హీరోగా ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన హీరో ఎవరైనా ఇలా అప్పడాలు అమ్మడం ఏమిటని సందేహపడుతున్నారా? అంతలా ఆలోచించకండి..బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తాను నటిస్తున్న ఓ సినిమాలోని పాత్ర కోసం అప్పడాలు కొనమని ప్రయాణికులను ప్రాధేయపడుతున్నాడు.


సినిమాని ప్యాషన్‌గా భావించే ఏ నటులైనా డీగ్లామర్ పాత్రలో కనిపించడానికి వెనకాడరు. క్యారెక్టర్ డిమాండ్ చేయడం బట్టి నటులు ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి అభిమానులను అలరిస్తుంటారు. 
 
తాజాగా హృతిక్ సూపర్ 30 అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో ఆనంద్ అనే పాత్రలో కనిపిస్తాడు. గణిత శాస్త్రవేత్త ఆనంద్ జీవితాన్ని ప్రధాన కథాంశంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎక్కడో మారుమూల ఓ చిన్న గ్రామంలో పెరిగి పెద్దవాడైన ఆనంద్ గణితంలో పట్టభద్రుడై, ఐఐటీ విద్యార్థులకు శిక్షణను ఇవ్వడం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడం వంటి విషయాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 
 
ఆనంద్ తన జీవనాధారం కోసం పాపడ్‌లు అమ్ముకుంటూ జీవించడం అనే అంశం చాలా కీలకమైంది. ఆ సమయంలో ఆనంద్ పడిన ఆవేదనను దర్శకుడు వికాస్ భల్ హృదయాన్ని తాకేలా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం జూలై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పడాలు అమ్ముతున్న చిత్రాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ఈ కీలక ఘట్టం ఆనంద్ జీవితాన్ని మలుపు తిప్పిన అంశం అని హృతిక్ పేర్కొన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్‌బాస్ 3 ప్రారంభం అయ్యేది అప్పుడేనా..?