Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉన్నది ఒకటే జిందగీలో రామ్ ఏడుస్తాడంటున్న హీరోయిన్.. ఎందుకు... ఏమిటి?

గత సంవత్సరంలో రెండు సినిమాలతో మంచి హిట్‌లు అందుకున్న ఎనర్జిటిక్ హీరో రామ్, ఈసారి "ఉన్నది ఒక్కటే జిందగీ" అంటూ అదే మాయ చేయబోతున్నాడు. నేను శైలజ సినిమా ఎంత మ్యూజికల్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ సి

Advertiesment
ఉన్నది ఒకటే జిందగీలో రామ్ ఏడుస్తాడంటున్న హీరోయిన్.. ఎందుకు... ఏమిటి?
, సోమవారం, 16 అక్టోబరు 2017 (18:58 IST)
గత సంవత్సరంలో రెండు సినిమాలతో మంచి హిట్‌లు అందుకున్న ఎనర్జిటిక్ హీరో రామ్, ఈసారి "ఉన్నది ఒక్కటే జిందగీ" అంటూ అదే మాయ చేయబోతున్నాడు. నేను శైలజ సినిమా ఎంత మ్యూజికల్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్‌లు ఈ సినిమాకీ పనిచేయడం విశేషం. దర్శకుడు కిశోర్ తిరుమల గత సినిమాలో రాసిన డైలాగ్‌లు యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యాయి, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ తనదైన బాణీలను అందించాడు. 
 
ఇప్పుడు ఈ ముగ్గురి కలయికలో సినిమా వస్తుందంటే, ప్రేక్షకులకు అంచనాలు పెరిగిపోయాయి. దానికి తగ్గట్టే, ఇప్పటికే రిలీజైన పాటలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి, అలాగే రామ్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందంట. అంతేకాదు కిశోర్ తిరుమల తన డైలాగ్‌లతో కట్టిపడేయడం ఖాయమంటున్నారు యూనిట్ సభ్యులు. "ఐ లవ్ యూ, బట్ ఐ యామ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ" లాంటి డైలాగ్‌లతో మురిపించి, ఈసారి హీరో త్వరలో ఏడవబోతాడంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్‌తో ఇంకా సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. 
 
ఈ యూత్‌ఫుల్ సబ్జెక్ట్‌తో వస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి కథానాయకులుగా నటించారు. అందం, అభినయం కలిసిన ఈ ముద్దుగుమ్మలు సినిమాలో తమదైన నటనతో ఆకట్టుకోనున్నారు. ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ బ్యానర్‌లో 'స్రవంతి రవికిశోర్' నిర్మిస్తున్నారు. ఈ సినిమా రామ్‌కి హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తుందని ఫ్యాన్స్ గట్టిగా చెప్పేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అర్జున్ రెడ్డి దర్శకుడితో పవన్ కళ్యాణ్‌ సినిమా చేయాల్సిందేనట...