Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాకారంకానున్న హైదరాబాద్ నగర వాసుల మెట్రో కల...

హైదరాబాద్ నగర వాసుల మెట్రోకల త్వరలో సాకారం కానుంది. నవంబరు నెలాఖరులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా హైదరాబాద్ మెట్రో సేవలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం హైదరాబాద్ మెట్రో అధికారులు శర

సాకారంకానున్న హైదరాబాద్ నగర వాసుల మెట్రో కల...
, సోమవారం, 16 అక్టోబరు 2017 (16:13 IST)
హైదరాబాద్ నగర వాసుల మెట్రోకల త్వరలో సాకారం కానుంది. నవంబరు నెలాఖరులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా హైదరాబాద్ మెట్రో సేవలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం హైదరాబాద్ మెట్రో అధికారులు శరవేగంగా పనులు పూర్తి చేస్తారు. 
 
తొలి దశలో నాగోల్ టూ అమీర్ పేట్, మియాపూర్ టూ అమీర్ పేట్ రూట్లల్లో మేజర్ పనులను వేగవంతం చేశారు. మొత్తం 30 కిలోమీటర్ల తొలిదశ మెట్రో స్ట్రెచ్‌లో మెట్టుగూడ టూ బేగంపేట్ కీలక టెస్ట్ రన్ ప్రారంభం కావడంతో నవంబర్ వరకు ప్రాజెక్ట్ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి నవంబర్ 15వ తేదీలోగా సెంట్రల్ రైల్వే నుంచి సేఫ్టీ సర్టిఫికెట్ వస్తుందనే భావిస్తున్నారు. 
 
మరోవైపు మెట్రోను గ్రీన్ ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దేందుకు పాదచారుల ఏరియాలో సుందరీకరణ పనులు చేస్తున్నారు. మెట్రో స్టేషన్స్, పిల్లర్స్ మధ్యలో కలర్‌ఫుల్ మొక్కలతో నింపేస్తున్నారు. నవంబర్ చివరి నాటికి మెట్రోను ప్రధానితో ప్రారంభించాలనే లక్ష్యంతో.. సెక్యూరిటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నగర కమీషనర్లు మియాపూర్ మెట్రో స్టేషన్ వర్క్ డెవలప్‌మెంట్స్‌ను పరిశీలించారు. 
 
మియాపూర్ టూ ఎస్ఆర్ నగర్ 12 కిలోమీటర్లు, నాగోల్ టూ బేగంపేట్ 16 కిలోమీటర్లు మాత్రమే ట్రయల్ రన్ నడుస్తున్నాయి. మిగతా 2 కిలోమీటర్లలో పనులు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ 2 కిలోమీటర్లు అందుబాటులోకి రాకున్నా… మెట్రో ప్రారంభించే ఆలోచన చేస్తున్నారు.
 
ఉప్పల్, సికింద్రాబాద్ నుంచి, హైటెక్స్, మియాపూర్‌కి వెళ్లే ప్రయాణికులు మెట్రో దిగి… బేగంపేట్‌లోని ఎంఎంటీఎస్ ట్రైన్ ఉపయోగించుకొనే అవకాశం ఉంటుంది. ఒకవేళ అమీర్‌పేట్ ఇంటర్ చేంజ్ పనులు పూర్తయితే 30 కిలోమీటర్ల మొత్తం స్ట్రెచ్‌ను జనం వినియోగించుకోవచ్చు. మొత్తంమీద మరో ఒకటి రెండు నెలల్లో హైదరాబాద్ నగరంలో మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తాజ్‌మహల్‌ను దేశ ద్రోహులు నిర్మించారా? ఎర్రకోటపై మోదీ జెండా ఎగురవేయడాన్ని ఆపేస్తారా?