Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హీరో నానికి తప్పిన పెను ప్రమాదం

Advertiesment
Nani
, ఆదివారం, 7 ఆగస్టు 2022 (17:07 IST)
హీరో నానికి పెను ప్రమాదం తప్పింది. తాజా చిత్రం షూటింగ్ సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని సింగ‌రేణి బొగ్గు గ‌నుల బ్యాక్‌డ్రాప్‌లో నాని హీరోగా తెర‌కెక్కుతున్న సినిమా ‘దసరా’. ఈ సినిమా కోసం భారీ విలేజ్ సెట్ వేసి చిత్రీక‌రిస్తున్నారు. 
 
షూటింగ్‌లో స‌మ‌యంలో ఓ బొగ్గు ట్రక్కు కింద నాని ఉండగా.. బొగ్గంత అతడి పై పడినట్లు సమాచారం. అయితే అదృష్టవశాత్తు నానికి గాయాలు ఏమీ కాలేదట. దీంతో కాసేపు షూటింగ్ నిలిపివేశారని.. నాని పూర్తిగా సిద్ధం అయ్యాకే షూటింగుని మళ్లీ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.
 
ఈ చిత్రంలో కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానరుపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండ‌గా.. శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించ‌నున్నాడు. అయితే ఈ చిత్రం షూటింగ్ గోదావరిఖనిలో జరుగుతోంది. ఈ ఏడాదిలోనే సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరేళ్ళుగా వేధిస్తున్నాడు... 30 నంబర్లు బ్లాక్ చేశా: నిత్యా మీనన్