Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Hero Krishna : ఫిష్ వెంకట్ కి హీరో కృష్ణ మానినేని రెండు లక్షల వైద్య సాయం

Advertiesment
Krishna Manineni donates Rs 2 lakh to Sravanthi

దేవీ

, గురువారం, 10 జులై 2025 (19:31 IST)
Krishna Manineni donates Rs 2 lakh to Sravanthi
జెట్టి సినిమా హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో వారు స్థాపించిన సేవా సంస్థ 100Dreams Foundation ద్వారా, సినీ నటుడు ఫిష్ వెంకట్  వైద్య అవసరాల కోసం వారి కూతురు స్రవంతి కి PRK హాస్పిటల్స్ లొ రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. చిత్రపరిశ్రమలో తనదైన హాస్యంతో  ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఫిష్ వెంకట్ గారు అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆయన వైద్య ఖర్చులకు మద్దతుగా ఈ ఆర్థిక సహాయం అందించడం హీరో కృష్ణ గారి యొక్క మానవతా విలువలను ప్రతిబింబిస్తోంది.
 
ఈ సందర్భంగా కృష్ణ మానినేని గారు మాట్లాడుతూ, 100Dreams Foundation లో ఒక కార్యక్రమం అయిన పునరపి (అవయవ దానం అవగాహన కార్యక్రమం) మా ఆశయం మాత్రమే కాదు – అవసరంలో ఉన్నవారికి జీవితం ఇవ్వాలన్న సంకల్పం. అవయవ దానం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒక్క నిర్ణయం – ఒక జీవితం," అని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వర్జిన్‌ బాయ్స్‌ లాటరీలో ఐఫోన్ గెలుచుకున్న తొలి ప్రేక్షకుడు