యాగంటిలో వాల్మీకి... ఇంత‌కీ హ‌రీష్ ఏం ప్లాన్ చేసాడు..?

శుక్రవారం, 14 జూన్ 2019 (20:51 IST)
క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుని త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్. గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాతో ఇండ‌స్ట్రీ హిట్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసారు. తాజాగా మెగా హీరో వ‌రుణ్ తేజ్‌తో హ‌రీష్ శంక‌ర్ వాల్మీకి అనే చిత్రం రూపొందిస్తున్నారు. 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్ పైన రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
వ‌రుణ్ తేజ్ గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. త‌మిళ హీరో అధ‌ర్వ ముర‌ళి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాళిని ర‌వి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ మధ్యనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ సినిమా, తదుపరి షెడ్యూల్ నిమిత్తం యాగంటి చేరుకుంది. 
 
దర్శకుడు హరీశ్ శంకర్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. శివుని ఆశీస్సులతో.. యాగంటి వంటి అద్భుతమైన ప్రదేశంలో షూటింగును మొదలుపెట్టాం అని అన్నారు. అక్కడ ఒక యాక్షన్ సీన్‌ను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. వరుణ్ తేజ్ బ్రహ్మాజీ తదితరులు ఈ యాక్షన్ సీన్లో పాల్గొంటున్నారు. గతంలో తమిళంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'జిగర్తాండ'కి ఇది రీమేక్. 
 
ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తిచేసి సినిమాను సెప్టెంబ‌ర్ 6న విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఐనాంక బోస్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. చాలా గ్యాప్ త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ ఈ సినిమా చేస్తున్నాడు. దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమాతో ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. మ‌రి.. ఈసారైనా స‌క్స‌స్ సాధిస్తాడో లేదో..?

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం చిన్మయిని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. మన్మథుడు-2లో ఆ పని ఆగిందా? (video)