Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కిష్కింధపురి జెన్యూన్ రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Advertiesment
Sai Srinivas,  Kaushik Pegallapati, Sahu Garapati, Chetan Bharadwaj

దేవీ

, శుక్రవారం, 12 సెప్టెంబరు 2025 (19:03 IST)
Sai Srinivas, Kaushik Pegallapati, Sahu Garapati, Chetan Bharadwaj
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. అద్భుతమైన ప్రిమియర్స్ తో మొదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ లో నిర్వహించారు.
 
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది చాలా హ్యాపీ మూమెంట్. గురువారం రోజు మూడు ప్రీమియర్ షోలు వేద్దామనుకుని మొదలైన మా సినిమా 66 షోలు పడ్డాయి. ఆర్గానిక్ గా మా సినిమా ఆడియన్స్ కి రీచ్ అయింది. ఆడియన్స్ ఇచ్చిన ప్రేమ ఆదరణ అంత ఇంతా కాదు. మేము చాలా జెన్యూన్ గా ప్రేమను సంపాదించాం. ఈ ప్రేమ కొనసాగుతుంది. తెలుగు ప్రేక్షకులు చాలా గొప్పోళ్ళు. దేవుళ్ళు. గొప్ప సినిమాని కాపాడుతారు. ఒక కొత్త జోనర్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చాలా కృషి చేసి సినిమా చేశాం. దీనికి సాహు గారు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ సినిమా ఖచ్చితంగా చాలా మంచి రేంజ్ కి వెళుతుంది. చేతన్ భరద్వాజ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత తను చాలా గొప్ప స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఈ సినిమాని థియేటర్లో చూసిన ప్రతి ఒక్కరూ చాలా గొప్ప రెస్పాన్స్ ఇచ్చారు. ఇది అందరికీ నచ్చే సినిమా.   కళ్యాణ్ గారి ఓజీ వచ్చేంతవరకు మా సినిమా వెళుతూనే ఉంటుంది. 1400 మంది క్రౌడ్ తో సినిమా చూశాను. రెస్పాన్స్ మామూలుగా లేదు. ఈ సినిమాని చూసి ఎలా ఉందో జెన్యూన్ గా చెప్పండి. ఇది ప్రేక్షక దేవుళ్ళని మెప్పించే సినిమా.
 
నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ... ఈ సినిమాని సపోర్ట్ చేసిన అందరికీ థాంక్యూ. మీడియా వారు ఈ సినిమాని ప్రేక్షకులకు దగ్గరగా తీసుకువెళ్లారు.  వారికి ధన్యవాదాలు. డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. మేము అనుకున్న దాని కంటే డబల్ ఇంపాక్ట్ రెస్పాన్స్ వస్తుంది. ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ఫోన్ చేసి విష్ చేశా.రు మా బ్యానర్ లో చాలా మంచి సినిమా పడింది. మా హీరో సాయి గారికి డైరెక్టర్ కౌశిక్ కి హీరోయిన్ అనుపమకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. వారి సహకారంతోనే ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చాను.ఇది  వెరీ ప్రౌడ్ మూమెంట్. థాంక్యూ ఆల్
 
డైరెక్టర్ కౌశిక్ మాట్లాడుతూ... అందరూ కలిసి మా సినిమాని మంచి సక్సెస్ఫుల్ ఫిలిం చేసినందుకు థాంక్యూ సో మచ్. ఫస్ట్ టైం హిట్ కొట్టినప్పుడు ఆ మూమెంట్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఈ మూమెంట్ ని నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. సాహుగారు, సాయిగారి  సపోర్ట్ తోనే ఇది పాజిబుల్ అయింది. సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ మూమెంట్ ని ఎప్పటికీ సెలబ్రేట్ చేసుకుంటాను.  
 
మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ మాట్లాడుతూ.. చాలా హ్యాపీ మూమెంట్ ఇది. ఎక్కడ చూసినా సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది.  ఆడియన్స్ రెస్పాన్స్ మాకు గొప్ప బలాన్ని ఇచ్చింది. మా సినిమాని ఎంత పాజిటివ్ రిసీవ్ చేసుకున్న అందరికీ థాంక్యు సో మచ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

KH 237: కమల్ హాసన్ 237 చిత్రం అన్బరివ్ దర్శకత్వంలో ప్రారంభం