Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హ్యాపీ బర్త్ డే ధనుష్: ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ ఉన్న ధనుష్ టాప్ 11 సినిమాలు ఇవే

Advertiesment
image
, గురువారం, 27 జులై 2023 (20:58 IST)
ధనుష్‌గా సుపరిచితుడైన వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా త్వరలో 40వ వసంతంలోకి అడుగుపెట్టనున్నాడు. తమిళ, హిందీ చిత్రపరిశ్రమల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి ధనుష్. ఆయన కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, గేయ రచయితగా, నేపథ్య గాయకుడిగా కూడా పనిచేశారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం 2002లో ధనుష్ తన సోదరుడు కె.సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన తుల్లువధో ఇలమై అనే టీనేజ్ డ్రామాతో వెండితెర అరంగేట్రం చేశారు.

అప్పటి నుండి ఈ నటుడు పుదు పెటై, తిరువిలైయదళ్ ఆరంభం, కాదల్ కొండేన్, అసురన్, ఆడుకలం వంటి అనేక బాక్సాఫీస్ విజయాలలో ప్రధాన పాత్రలలో నటించాడు. ఆడుకలం, అసురన్ సినిమాల్లోని నటనకు వరుసగా 58, 67వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడిగా అవార్డులు లభించాయి. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన రాంజానా చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ నటుడు ఈ ఏడాది ప్రారంభంలో దీనికి సీక్వెల్ ప్రకటించారు.
 
ఐఎండీబీ ప్రకారం ధనుష్ టాప్ 11 అత్యధిక రేటింగ్ పొందిన సినిమాల జాబితా ఇదే.
1) పుదు పెటై, - 8.5
2) అసురన్ - 8.4
3) వడ చెన్నై - 8.4
4) ఆడుకలం - 8.1
5) కర్ణన్ - 8
6) కాదల్ కొండేన్ - 8
7) తిరుచిత్రబలం - 7.9
8) వేలైయిల్లా పట్టతారి- 7.8
9) పోల్లధవన్ - 7.7
10) మాయక్కం ఎన్న - 7.7
11) రాంజనా - 7.6

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోలీవుడ్‌లో అలాంటి నిబంధనేదీ పెట్టలేదు : నటుడు నాజర్