Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Advertiesment
Jugari Cross

చిత్రాసేన్

, శుక్రవారం, 17 అక్టోబరు 2025 (20:06 IST)
Jugari Cross
ప్రముఖ రచయిత పూర్ణచంద్ర తేజస్వి ప్రసిద్ధ నవల జుగారి క్రాస్ ను సినిమాగా రూపొందిస్తున్నారు. కరావళి తో అందరినీ ఆకట్టుకోనున్న దర్శకుడు గురుదత్త గనిగ ఈ ప్రాజెక్ట్‌ను టేకప్ చేశారు. టైటిల్, టీజర్ అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. రాజ్ బి. శెట్టి ప్రముఖ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ విడుదలకు ముందు గురుదత్త గనికి, రాజ్ బి. శెట్టి కాంబోలో మరో చిత్రం ప్రారంభమైంది.
 
ఇక ఈ ‘జుగారి క్రాస్’కు సంబంధించిన ప్రకటన కోసం రిలీజ్ చేసిన టైటిల్ ప్రోమో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అద్భుతమైన విజువల్స్, గూస్ బంప్స్ తెప్పించే బీజీఎంతో టైటిల్ ప్రోమో దుమ్ములేపేసింది. ఇక ఇందులో చూపించిన పుర్రెలు, పారే రక్తం, మారణాయుధాలు చూస్తుంటే భారీ యాక్షన్‌ చిత్రంగా రానున్నట్టు కనిపిస్తోంది. 
 
రాజ్ బి. శెట్ తన పాత్రల ఎంపిక విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నారో అందరికీ తెలిసిందే. ఎల్లప్పుడూ ప్రత్యేకమైన, అసాధారణమైన పాత్రలను చేస్తూ విజయాన్ని అందుకుంటున్నారు. చివరగా 'సు ఫ్రమ్ సో'లో గురూజీగా ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే 'కరావళి'లో మరో అద్భుతమైన పాత్రతో మెప్పించబోతోన్నారు. ఈ మూవీ విడుదల కాకముందే ఈ దర్శకుడు, రాజ్ బి. శెట్టి కలిసి ఇప్పుడు 'జుగారి క్రాస్' అనే శక్తివంతమైన ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు.
 
రాజ్ బి. శెట్టి, గురుదత్త గనిగ మధ్య ఇలానే మున్ముందు మరిన్ని చిత్రాలు వస్తాయని, వారిద్దరి మధ్య సహకారం ఇలానే కొనసాగుతుందని టీం చెబుతోంది. టైటిల్ ప్రోమో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది.
 
చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం గురుదత్త ఇప్పుడు జుగారి క్రాస్ కోసం సిద్ధమవుతూనే ‘కరావళి’ పోస్ట్-ప్రొడక్షన్ పనుల్లోనూ బిజీగా ఉన్నారు. దర్శకత్వంతో పాటు గురుదత్త గనిగ ‘గురుదత్త గనిగ ఫిల్మ్స్’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరావళి చిత్రానికి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ అభిమన్యు సదానందన్ జుగారి క్రాస్‌కు కూడా విజువల్స్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సచిన్ బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మిగిలిన నటీనటులు, సిబ్బంది వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్