Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

8 A. M. మెట్రో పోస్టర్‌ను లాంచ్ చేసిన గుల్జార్

Launched by Gulzar
, శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (16:05 IST)
Launched by Gulzar
ప్రముఖ గేయ రచయిత, దర్శకుడు, ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, కవి గుల్జార్..  రాజ్ రాచకొండ దర్శకత్వం వహిస్తున్న  '8 A. M. మెట్రో' పోస్టర్‌ను లాంచ్ చేశారు. గుల్షన్ దేవయ్య , సయామి ఖేర్ నటించిన ఈ  ఎమోషనల్ రోలర్ కోస్టర్  మే 19న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని శిలాదిత్య బోరా ప్లాటూన్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేస్తున్నారు.
 
రాజ్ రాజ్ రాచకొండ ఇంతకుముందు 2019లో అవార్డ్ విన్నింగ్ తెలుగు సినిమా ‘మల్లేశం’కు దర్శకత్వం వహించారు.  టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF)కి ఎంపికైన 2021 మలయాళ చిత్రం పాకాలో కూడా అసోషియేట్ అయ్యారు.
 
గుల్జార్ సాబ్ తన ఆరు కవితలను ఈ చిత్రానికి అందించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. పోస్టర్ లాంచ్ సందర్భంగా గుల్జార్ మాట్లాడుతూ.. స్క్రిప్ట్‌ చదివినప్పుడు చాలా గొప్ప అనుభూతి కలిగింది. తక్షణమే చిత్రానికి సహకారం అందించాలనిపించింది’’ అని హర్షం వ్యక్తం చేశారు.
 
చిత్రం,గుల్జార్ సాబ్ సహకారం గురించి రాజ్ మాట్లాడుతూ, “ఇది మెట్రోలో అనుకోకుండా కలుసుకుని,  ఒకరినొకరు  తెలుసుకునే ఇద్దరు అపరిచితుల కథ.  గుల్జార్ సాబ్‌ అందించిన సహకారానికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఎప్పటికీ ఆయనకి రుణపడి వుంటాను’’ అన్నారు.
 
" ఇందులో నా పాత్ర ఒక సీక్రెట్ వుంది. అది ఇద్దరి వేరు చేయడంతో పాటు నమ్మకాల్ని కూడా చీల్చుతుంది" అని గుల్షన్ చెప్పుకొచ్చారు.  "నేను గుల్జార్ సాహబ్ రాసిన కవిత్వాన్ని చదివానంటే మీరు నమ్మగలరా?’’ అంటూ సయామి ఖేర్ ఆనందం వ్యక్తం చేసింది.
 
ఈ చిత్రానికి గుల్జార్ కవిత్వంతో పాటు, మార్క్ కె. రాబిన్ చేసిన సినిమా సంగీతంలో కౌసర్ మునీర్ రాసిన పాటలు ఉన్నాయి. జుబిన్ నౌటియల్, జోనితా గాంధీ, జావేద్ అలీ, విశాల్ మిశ్రా, నూరన్ సిస్టర్స్ పాటలు పాడారు.
ఈ చిత్రాన్ని మే 19న దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమంత ప్రభు భారీ కటౌట్‌ పెట్టినా ఫలితం శూన్యమేనా!