Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సమంత ప్రభు భారీ కటౌట్‌ పెట్టినా ఫలితం శూన్యమేనా!

Advertiesment
Samanthaprabhu2
, శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (15:52 IST)
Samanthaprabhu2
ఈరోజు విడుదలైన శాకుంతలం సినిమా అన్ని చోట్ల విడుదలైంది. ఓవర్‌సీస్‌లోనూపెద్దగా స్పందన రాలేదు. ఇక హైదరాబాద్‌లోని దేవీ70ఎం.ఎం. థియేటర్‌లో భారీ కటౌట్‌ పెట్టారు. ఇది చాలా పెద్ద థియేటర్‌. కానీ న్యూస్‌షోకు ప్రేక్షకులే కరువయ్యారు. గత వారం రోజులుగా అన్నిచోట్ల ప్రివ్యూలు ప్రదర్శించారు. అందులో కొన్ని కరెక్షన్లుకూడా చేసుకునేందుకు వీలుకలిగింది. కానీ విజువల్‌ ఎఫెక్ట్స్‌లో కొన్ని లోపాలు కనిపించాయి. పాత్రలు అడవిలోనూ, కశ్మీర్‌లోనూ నడుస్తున్నప్పుడు ఆ లోపం క్లియర్‌గా కనిపిస్తుంది.
 
బాహుబలి విడుదల తర్వాత దర్శక నిర్మాత గుణశేఖర్‌ తీసిన రుద్రమదేవి అబాసుపాలైంది. అందులోనూ సాంకేతిక అధునాతనంగా చూపారు. కానీ ఫలితంలేదు. ఆ సినిమా ఆయనకు నష్టాలు తెచ్చిపెట్టింది. అయినా మొక్కవోని దీక్షతో మరలా సంవత్సరాలు గేప్‌తీసుకుని శాకుంతలం తీశాడు. కథకంటే విఎఫ్‌ఎక్స్‌పైనే  ఆధారపడిన గుణశేఖర్‌కు మొదటి రోజే థియేటర్‌లో సందడిలేకుండా పోవడం విశేషం. ఆర్‌.ఆర్‌.ఆర్‌.టీమ్‌తోనే గ్రాఫిక్స్‌ పనులన్నీ చేశానని చెప్పినా దుష్యంతునితో రాక్షసులు వార్‌ అనేది పెద్ద ఎట్రాక్ట్‌ కలిగించలేదు. ఇక పిల్లలు కూడా చాలా మెచ్యూర్డ్‌గా ఫోన్లలోనే గ్రాఫిక్స్‌ సినిమాలు చూస్తుంటే అంతకుమించి వుంటేనే శాకుంతలం సినిమా చూస్తారనే టాక్‌ ప్రబలంగా వినిపిస్తోంది. మొత్తంగా కటౌట్లు, ప్రింటింగ్‌ ఖర్చులు కూడా వస్తాయో రావోనని సందేహం అయితే కనిపిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాబీ, పి.భవానీ రవి కుమార్ గెస్ట్ లుగా వాల్తేర్‌ వీరయ్య 100రోజులు వేడుక