Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గౌతమ్ మీనన్ సినీ జర్నీ.. జీవిత విశేషాలు.. బయోగ్రఫీ

Advertiesment
gautam menon

సెల్వి

, సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (11:34 IST)
ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ పుట్టిన రోజును ఆదివారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణంలో కొన్ని విశేషాలను గురించి తెలుసుకుందాం. గౌతమ్ మీనన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 
 
గౌతమ్ మీనన్ మూకాంబిగై కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి, 1993 బ్యాచ్‌లో పట్టభద్రుడయ్యాడు. గౌతమ్ మీనన్ డెడ్ పోయెట్స్ సొసైటీ, నాయగన్ వంటి చిత్రాల నుండి ప్రేరణ పొందినట్లు పేర్కొన్నాడు. కెరీర్ మార్గాన్ని మార్చుకోవాలని, చిత్రనిర్మాతగా మారాలని తన తల్లిదండ్రులకు తన కోరికను వ్యక్తం చేశాడు. 
 
తన కళాశాల హాస్టల్‌లో తన మొదటి చిత్రాన్ని రాశాడు. ఫిల్మ్ మేకర్ రాజీవ్ మీనన్ వద్ద శిష్యరికం తీసుకున్నారు. 1997లో మిన్సార కనవు అనే సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అందులో అతను అతిధి పాత్రలో కూడా కనిపించాడు. ధ్రువ నక్షత్రం - చాఫ్టర్ వన్ -  యుద్ధ కాండం, బాలయ్య 109 వ సినిమా, హిట్లర్ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. 
 
గౌతమ్ 25 ఫిబ్రవరి 1973న కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని ఒట్టపాలంలో జన్మించారు. అతని తండ్రి వాసుదేవ మీనన్ మలయాళీ, తల్లి ఉమ తమిళురాలు. కేరళలో జన్మించినప్పటికీ, అతను చెన్నైలోని అన్నానగర్‌లో పెరిగాడు.
 
పూర్తి పేరు- గౌతమ్ వాసుదేవ మేనన్ 
వృత్తి - దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రచయిత, నటుడు 
దర్శకత్వంలో గుర్తింపు సంపాదించి పెట్టిన చిత్రాలు- మిన్నలే (2001), కాక్క కాక్క (2003), వేట్టైయాడు విలయాడు (2006), వారణం ఆయిరాం (2008), విన్నైత్తాండి వరువాయ (2010), ఎన్నై అరిందాల్ (2015), వెందుతనిందదు కాడు (2022), 
ఎత్తు - 180 సీఎం 
వయస్సు -50 ఏళ్లు 
భార్య పేరు - ప్రీతి మేనన్ 
సంతానం - ముగ్గురు కుమారులు (ఆర్య, ధ్రువ, ఆద్య)
తండ్రి - వాసుదేవ్ మేనన్ 
తల్లి - ఉమా ప్రభాకరన్ (పీజీటీ టీచర్)
నచ్చిన స్వీట్స్ - హాట్ చాక్లెట్ 
నచ్చిన నటులు - కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ 
నటీమణులు - కాజోల్, నయనతార 
నచ్చిన సినిమాసు - ఆవారా, నాయగన్, అమర్కలం, సుబ్రహ్మణ్యపురం 
నచ్చిన దర్శకులు - మణి రత్నం, రామ్ గోపాల్ వర్మ 
సంగీత దర్శకుడు- హారిస్ జయరాజ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పడక సుఖం ఇవ్వలేదని పగబట్టారు... నటి రవీనా టాండన్ సంచల కామెంట్స్