Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇండ‌స్ట్రీ స్ట్ర‌గుల్‌లో బింబిసారతో హిట్ ఇవ్వ‌టం గొప్ప విష‌యం- దిల్‌రాజు

Advertiesment
Nandamuri Kalyan Ram, Dil Raju, Vashishta, Harikrishna and others
, సోమవారం, 8 ఆగస్టు 2022 (20:59 IST)
Nandamuri Kalyan Ram, Dil Raju, Vashishta, Harikrishna and others
బింబిసార చిత్రం గురించి నైజాం పంపిణీదారుడు దిల్ రాజు మాట్లాడుతూ ‘‘జూన్ 3న మేజర్, విక్రమ్ సినిమాలు విడుదలై మంచి విజయాన్ని చూశాయి. ఆ తర్వాత రెండు నెల‌ల పాటు సినిమాలేవీ ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేదు. ఈ త‌రుణంలో ఇండ‌స్ట్రీ ఎలా ఉండ‌బోతుంది. ఏం చేయాలనే విష‌యాల‌ను క‌థ‌ల ద‌గ్గ‌ర నుంచి డిస్క‌స్ చేసుకుంటూ వ‌స్తున్నాం. ఆగ‌స్ట్ 5న మ‌ళ్లీ రెండు సినిమాలు విడుద‌లై సినీ ఇండ‌స్ట్రీకి ఊపిరిని పోశాయి. బింబిసార‌, సీతారామం చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రించారు. ఇండ‌స్ట్రీ అంతా ఓ ఫ్యామిలీ. సినిమాలు ఆడుతుంటే ఓ క‌ళ వ‌స్తుంది. రెండు నెల‌ల త‌ర్వాత ఇండ‌స్ట్రీకి ఆ క‌ళ‌ను తీసుకొచ్చిన నిర్మాత‌ల‌కు ముందుగా థాంక్స్‌. ఈరోజు ఇండ‌స్ట్రీ స్ట్ర‌గుల్‌లో ఉంది. పాండ‌మిక్ త‌ర్వాత సినీ ఇండ‌స్ట్రీని ముందుకు తీసుకెళ్ల‌డానికి చాలా హోం వ‌ర్క్ చేస్తున్నాం. బింబిసార విష‌యానికి వ‌స్తే సినిమా పెద్ద స‌క్సెస్ అయ్యింది. ఓ సినిమా స‌క్సెస్ అయ్యిందంటే కార‌ణం.. సినిమా కాస్ట్‌. సినిమాను నిర్మాత ప‌రిమిత బ‌డ్జెట్‌లో చేసుక‌ని దాన్ని త‌న డిస్ట్రిబ్యూట‌ర్స్‌కు రీజ‌న్‌గా ఇవ్వ‌టం.. వారికి మూడు రోజుల్లోనే డ‌బ్బులు రావ‌ట‌మే కొల‌మానం. నిర్మాత హ‌రికృష్ణ ఈ సినిమాపై రెండున్న‌రేళ్లుగా హోం వ‌ర్క్ చేసుకుంటూ డైరెక్ట‌ర్‌, టెక్నీషియ‌న్‌తో మాట్లాడుకుంటూ ప్రాప‌ర్‌గా ప్లాన్ చేసుకుని మా అంద‌రికీ ఆద‌ర్శంగా నిలిచారు. 
 
ఓ కొత్త ద‌ర్శ‌కుడికి ఇంత మంచి పేరు రావ‌టం అనేది మామూలు విష‌యం కాదు. దాని వెనుక వశిష్ట కృషి ఎంతో ఉంది. త‌ను హిట్ కొట్టం వేరు. ఇండ‌స్ట్రీ స్ట్ర‌గుల్‌లో ఉన్నప్పుడు ఇంస్ట్రీకి హిట్ ఇవ్వ‌టం గొప్ప విష‌యం. అందుకు వ‌శిష్ట‌కు థాంక్స్‌. నిర్మాత హ‌రికి, డైరెక్ట‌ర్ హ‌రికి కళ్యాణ్‌రామ్‌గారు తోడ‌య్యారు. దీంతో బ‌డ్జెట్‌లే కాదు స‌క్సెస్ కూడా సాధించ‌వ‌చ్చున‌ని నిరూపించారు. క‌ళ్యాణ్‌రామ్‌గారి పెర్ఫామెన్స్ చూసి వావ్ అనిపించింది. సినిమా కొట్టేస్తుంద‌నిపించింది. అయితే ఏ రేంజ్‌లో కొడుతుందో తెలియాలంటే సినిమా థియేట‌ర్స్ కి వెళ్లే వ‌ర‌కు వెయిట్ చేయాల‌ని రిలీజ్ వ‌ర‌కు చూశాను. నిర్మాత హ‌రిగారు నా చేతిలో పెట్టి ప‌ట్టుబ‌ట్టి రిలీజ్ చేయించారు. మార్నింగ్ షో త‌ర్వాత సూప‌ర్ డూప‌ర్ హిట్ టాక్ రావ‌టంతో అంద‌రి క‌ళ్ల‌లో ఆనందం క‌నిపించింది. ప‌టాస్‌, శ‌త‌మానం భ‌వతి, ఎఫ్ 3 సినిమాలు మూడు రోజుల్లోనే డిస్ట్రిబ్యూట‌ర్స్‌కి బ్రేక్ ఈవెన్ అయ్యింది. నాలుగో రోజునే ప్రాఫిట్స్ రావ‌టం అరుదైన విష‌యం. ఈ వ‌రుసలోకి బింబిసార వ‌చ్చి చేరింది. కీర‌వాణిగారు మూడు నెల‌లు బ్యాగ్రౌండ్ స్కోర్‌కి టైమ్ తీసుకుని నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లారు. ఎడిట‌ర్ త‌మ్మిరాజు ముందు నుంచి సినిమా బాగా వ‌స్తుంద‌ని చెబుతూనే ఉన్నాడు. త‌ను అన్న‌ట్లుగానే సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఇదే ఉత్సాహంతో నేను కూడా ముందుకెళ‌తాను’’ అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బింబిసార సక్సెస్ నాకు మళ్లీ పుట్టినట్లనిపించింది: క‌ళ్యాణ్ రామ్‌